BJP leader Ramana: వరద కాలువలో శవమై తేలిన బీజేపీ నేత రమణ

Read Time:  1 min
BJP leader Ramana: వరద కాలువలో శవమై తేలిన బీజేపీ నేత రమణ
FONT SIZE
GET APP
bjp-leader-ramana-found-dead-in-flood-canal
bjp-leader-ramana-found-dead-in-flood-canal

BJP leader Ramana: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్ధపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గత మూడు రోజులుగా అదృశ్యమైన బీజేపీ నేత రమణ, ఆదివారం స్థానిక వరద కాలువలో శవమై కనిపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా రమణ పని చేశారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. 3 రోజుల క్రితం పెగడపల్లిలో మిస్సింగ్ కేసు నమోదు అయింది.

Read Also: Manchireddy Kishan Reddy: మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పోలీసు నోటీసులు

మూడు రోజుల క్రితం మిస్సింగ్.. హత్యనా? ప్రమాదమా?

మూడు రోజులుగా ఆయన కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన కారును ఎస్సారెస్పీ కాలువలో గుర్తించి వెలికి తీయగా అందులో రమణారెడ్డి మృతదేహం ఉంది. ప్రమాదవశాత్తు కారు అందులో పడిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఆయన 18వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారని,

దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఈ ప్రాంతాన్ని దాటి అతను బయటకు వెళ్లినట్లుగా ఎక్కడా లేదన్నారు. దీంతో ఇదే ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా ఈరోజు ఉదయం కాలువలో పడినట్లు గుర్తించామని అన్నారు. కారును వెలికితీయగా రమణ మృతదేహం లభ్యమైందన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.