వార్డెన్ అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రేమను అందించే అప్యాయత పోస్టుకు చిహ్నం. తమ పిల్లల్ని హాస్టల్ ఉంచి, మంచిగా చదువుకోవాలని, వారి భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలనే కోటి ఆశయాలతో వార్డెన్ కు అప్పగిస్తారు. పిల్లలు తప్పు చేస్తే, వారిని తప్పనిసరిగా క్రమశిక్షణలో ఉంచాల్సిన బాధ్యత కూడా వార్డెన్ దే. వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారిదే. అలాంటి వార్డెన్లు కొందరు పదవిని అడ్డుపెట్టుకుని, విద్యార్థులపై విచక్షణారహితంగా దాడుతలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ హాస్టల్ వార్డెన్ ఓ అమ్మాయిని చితకబాదిన కేసులో సస్పెండ్ కు గురైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: Mahabubnagar: మైనర్ల ప్రేమ గర్భం దాల్చిన బాలిక
ప్రతిరోజు ఇదే తంతు.. విద్యార్థుల ఆరోపణలు
భూపాలపల్లిలోని ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థినిని తన రూపంకి పిలిపించుకున్న వార్డెన్ భవానీ, ఆ బాలికను ఇష్టమొచ్చినట్లుగా కొట్టింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్టు కాగానే వైరల్ గా మారింది. ప్రతిరోజూ తమను ఇలాగే ఏదో ఒక సాకు చూపి వార్డెన్ కొడుతుందని హాస్టల్ విద్యార్థులు వాపోతున్నారు. అందేకాక విద్యార్థులను విచక్షణారహితంగా కొడుతున్న వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. ఈ ఘటన జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో వార్డెన్ భవానిని సస్పెండ్ చేస్తూ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. భవానీ హాస్టల్ లో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కొడుతున్న ద)శ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయంపై సోషల్ వెల్ఫేర్ డీడీ విచారణ చేపట్టి నివేదిక సమర్పించడంతో జిల్లా కలెక్టర్ భ వానిని సస్పెండ్ చేస్తూ ఉత్తుర్వులు జారీ చేశారు.
గతనెల 24న జరిగిన ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి..
గతనెల 24వ తేదీన హాస్టల్ లో స్వల్ప కారణంతో వార్డెన్ భవానికి, సదరు విద్యార్థినికి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వార్డెన్, విద్యార్థిని అని కూడా చూడకుండా కర్రతీసుకుని దాడికి తెగబడ్డారు. తటి విద్యార్థినులు అడ్డుకుంటున్నా వినకుండా.. బూతులు తిడుతూ కనికరం లేకుండా కొట్టారు. ఈ దారుణాన్ని గమనించిన తోటి విద్యార్థినులు తమ ఫోన్లలో వీడియో తీశారు. అయితే వార్డెన్ పై భయంతో నెలరోజులుగా గోప్యంగా ఉంచారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా అయింది. దీంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: