📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Bhatti Vikramarka: మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే లక్ష్యం – ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Author Icon By Sharanya
Updated: July 18, 2025 • 12:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (సైఫాబాద్): మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడమే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు ఆర్థికంగా బలోపేతం అయినప్పుడు లింగ వివక్ష సమస్య నివారించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమ ంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఏడాది మహిళా సంఘాలకు 20 వేల కోట్లు వడ్డిలేని రుణాలను (Interest-free loans) అందిస్తున్నామని చెప్పారు.

లింగ సమానత్వం-లింగ స్పష్టత కార్యక్రమం

నిజాం కళాశాల, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల కోసం లింగ సమానత్వం-లింగ స్పష్టత కార్యక్రమం (Gender Equality-Gender Clarity Program) జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మల్లుభట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ విద్యా సంస్థలు లింగ సమానత కలిగిన సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ కృషి వల్ల నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ న్యాయ శాఖ మంత్రిగా ఉండి హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టడం వల్లనే జెండర్ ఈక్వాలిటితో పాటు ఈక్వల్ రిజర్వేషన్లు, డౌరి ప్రొహిబిషన్ చట్టాలు అమలు జరిగాయని ఆయనగుర్తు చేశారు. మహిళల సాధికారత రక్షణ, సమగ్ర అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను కలిగియున్నదని ఆయన గుర్తు చేశారు.

మహిళల సాధికారత కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న దృఢమైన చర్యలను ఆయన వివరించారు. ముఖ్యంగా స్వయం సహాయ సంఘాల ప్రోత్సహం మహిళలకు ఆర్టీసీ బస్లలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం, సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో 20 వేల కోట్ల రూపాయలు కేటాయించడం, ఆర్థిక స్వాలంబన నిజమైన సాధికారతకు కీలకమన్నారు. అన్ని రంగాలలో మహిళలకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తాను నిజాం కళాశాల పూర్వ విద్యార్థినని నాటి రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. దేశానికి గుర్తింపు తీసుకువచ్చిన శాస్త్రవేత్తలు, ఐఎఎస్లు, రాజకీయ నాయకులు, సినీ నటులు, సామాజిక ఉద్యమకారులు, ఇతర నాయకులను తయారు చేసిన సంస్థగా నిజాం కళాశాలకు చరిత్ర ఉందన్నారు. తన మాతృ విద్యా సంస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వ స్థాయిలో పెండింగ్లో ఉన్న నిధులు విడుదలకు సిఎం రేవంత్రెడ్డితో చర్చించి విడుదల చేస్తానని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రా ష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నెరెల్ల శారద, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎ.వి. రాజశేఖర్, డా. ఫర్జానాఖాన్, ఉదయరాణి, సుధామలక్ష్మి, కె.రేవతి, జి.పద్మ, ఉమాదేవి, ఈశ్వరీబాయి, షాహిన్, అఫ్రోస్ తదితరులు పాల్గొన్నారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: TGCPGET: ముగిసిన కామన్ పిజి ఎంట్రన్స్ పరీక్షల దరఖాస్తు గడువు

bhatti vikramarka Breaking News Economic Freedom for Women latest news Mahila Swayam Sahayaka Sangham Self Help Groups (SHGs) Telangana Government Schemes Telugu News Women Empowerment Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.