📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Bhatti Vikramarka: ఆర్టీసీకి ‘మహాలక్ష్మి’ లాభాలు..రూ. 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి: డిప్యూటీ సిఎం భట్టి

Author Icon By Sharanya
Updated: July 24, 2025 • 11:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణలోని మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం తెచ్చిందని ఈ మహాలక్ష్మీ పథకం (Mahalaxmi Scheme) ద్వారా ఆర్టీసి లవాభాల్లో వెళ్తుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈమేరకు బుధవారం హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్టాండ్ ప్రాంగణంలో మహ లక్ష్మిమహిళల 200 కోట్ల ప్రయాణ వేడుకలు ఘనంగా జరిగాయి.

200 కోట్ల ఉచిత ప్రయాణాలు

ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న మహిళలను, ఈ స్కీమ్ను సమర్థవంతంగా అమలు చేస్తోన్న ఆర్టీసీ సిబ్బందిని వారు సన్మానించారు. 200 కోట్ల ప్రయాణాల ద్వారా మహిళలు ఆదా చేసుకున్న రూ.6680 కోట్ల చెక్ను ప్రభుత్వం తరపున ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందజేశారు. ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన జీరో టికెట్ల రియం బర్స్మెంట్ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్టీసీకి చెల్లిస్తోం దన్నారు. ఈ పథకం ద్వారా ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతమవుతోందని తమప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2400 కొత్త బస్సు (2400 new buses)లను సంస్థ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు 2800 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలుకు టీజీఎస్ ఆర్టీసీ కసరత్తు చేస్తోందన్నారు. సంస్థలో ఇప్పటికే 11 శాతం ఎలక్ట్రిక్ బస్సులున్నా యని ఉచిత ప్రయాణమే కాదు.. బస్సులకు మహిళలను తమ ప్రభుత్వం యజమాను లను చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.20 వేల కోట్లతో రోడ్ల మరమ్మత్తులు, అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని, దాని ద్వారా ప్రజా రవాణా వ్య వస్థ మరింతగా ప్రజలకు చేరువ అవుతుందని అన్నారు. ఆర్టీసీకి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోన్న ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు.

35 లక్షల మంది మహిళలు రాకపోకలు

మహిళల దైనందిన జీవితంలో మహాలక్షి ్మ పథకం భాగమైందని మహిళలు 200 కోట్ల ప్రయాణాలు చేసిన సందర్భంగా రాష్ట్రంలోని 97 డిపోలు, 324 బస్ స్టేషన్లలో ఘనంగా వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలుతో పాటు నియామకాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయం, ఉద్యోగుల సంక్షేమానికి టీజీఎస్ఆర్టీసీ ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రతి గ్రామం నుంచి మండలానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కొత్త రహదారుల నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ మాట్లాడుతూ.. మహాలక్షి పథకాన్ని ప్రస్తుతం 7913 బస్సుల్లో అమలు చేస్తున్నామని, ఆయా బస్సుల్లో ప్రతి రోజు సగటున 35 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ఈ పథక అమలుకు ముందు ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 69 ఉండగా.. ప్రస్తుతం అది 97 శాతానికి పెరిగిందని తెలిపారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్,
హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, ఖుస్రోషా ఖాన్, రాజశేఖర్, వెంకన్న, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప, ఇతర హెచ్్వడీలు పాల్గొన్నారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: CM Revanth : ఢిల్లీలోనే సీఎం రేవంత్.. ఇవాళ పార్టీ ఎంపీలకు పీపీటీ

bhatti vikramarka Breaking News latest news Mahalakshmi free bus Mahalakshmi scheme success TGRTC Mahalakshmi Scheme TGRTC revenue growth

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.