📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Bhatti Vikramarka: వరి బోనస్ తో 25 వేలు ఆదా

Author Icon By Saritha
Updated: March 18, 2026 • 11:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bhatti Vikramarka: రైతు భరోసా కాకుండా ఒక్కో రైతుకు వరి ధాన్యం బోనస్ పేరిట 25,000 ఆదా అవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. శాసనసభలో కెటిఆర్ ప్రసంగంను అడ్డుకొని ఉపముఖ్యమంత్రి వివరణ ఇస్తూ రైతుల శ్రమను గుర్తించి సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్ రైతుల ఖాతాలో వేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో 9,000 కోట్లు కేవలం తొమ్మిది రోజుల్లో వారి ఖాతాలో జమ చేశారు అన్నారు.

Read Also: Telangana Rain updates: రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న అకాల వర్షాలు

Bhatti Vikramarka: Save 25 thousand with rice bonus

మహిళలకు రూ. 57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు

వడ్డీలేని రుణాల కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు సంవ త్సరానికి 20వేల కోట్ల పైగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు ఇప్పటివరకు వడ్డీ లేని రుణాల కింద 57 వేల కోట్లను మహిళల ఖాతాలో జమ చేశామని తెలిపారు. మహిళలు బాగు పడితే కుటుంబం మొత్తం బాగుపడుతుంది తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుం దాని వివరించారు. టిఆర్ఎస్ నేతలకు మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. ప్రతి సందర్భంలో కేటీఆర్ మహిళల మనసు గాయపరుస్తున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ మహిళల గురించి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి అన్నారు. కేటీఆర్ దారి తప్పి మాట్లాడుతున్నారు అనిపిస్తుంది, మహిళల అభివృద్ధి గురించి వారికి శ్రద్ధ ఉంటే వారి క్యాబినెట్లో మహిళలకు అవకాశం కల్పించేవారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేస్తాం: డి.సిఎం భట్టి

కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వడ్డీ లేని రుణాలు చెక్కులు చెల్లించుకుంటూ పోతున్నాం, కోటి మంది మహిళలను కోటీశ్వ రులుగా చేస్తాం మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అడ్డం కులు సృష్టించిన ముందుకు పోతూనే ఉంటాం అన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళలను మహారాణు లుగా గౌరవిస్తుంది వారు రాష్ట్రంలో చేసేందుకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఎక్కడ ఆల స్యం అవుతుందో అని ప్రమాణ స్వీకారం చేసిన గంటలోపే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాం అని తెలిపారు. ఆడబిడ్డల పక్షాన బస్సు చార్జీలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి క్రమం తప్పకుండా ప్రతినెలా చెల్లిస్తుందని వివరించారు. అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు, మేకలను ఎక్కడ కట్టివేయాలి అని మేము డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని పదేళ్లపాటు మాటలు చెప్పారు, టిఆర్ఎస్ నేతల మాటలు నమ్మి ప్రజలు చూసి చూసి కళ్ళు కాయలు కాసేయ్. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మాత్రం రాలేదు అన్నారు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున మంజూరు చేసి నిండు నిర్మాణం ప్రారంభించాం.

రైతు భరోసాతోపాటు మరిన్ని సంక్షేమ చర్యలు

మొదటి దశలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఒకేసారి 22,500 కోట్లు మంజూరు చేశాం దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజా ప్రభుత్వం అమలు చేసుకుంటూ ముందుకు పోతుందని తెలిపారు. కానీ టిఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, దళిత సీఎం, భూమిలేని పేదలకు వ్యవసాయ భూమి పంపిణీ హామీల్లో ఏ ఒక్కటి పది సంవత్సరాల కాలంలో నెరవేర్చలేదు అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 53-54 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. అలాగే 1 కోటి 6 లక్షల మందికి ప్రతి నెల 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పాలనను అమలుచేస్తోందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

bhatti vikramarka Free bus travel for women Indiramma Indlu Scheme Telangana Paddy Bonus Women Interest Free Loans

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.