📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Bhatti Vikramarka: సంక్షేమానికి రూ.95,351కోట్ల వ్యయం: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Author Icon By Sharanya
Updated: June 25, 2025 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్ళలో ముందుకు తీసుకుపోతున్నామని సంక్షేమంపై రూ.95,351 కోట్లు ఖర్చుచేస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. పిఎసీ సమావేశంలో ఆయన మాట్లాడిన ఆనంతరం గాంధీభవన్లో విలేఖరుతో మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అని తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేయడంతోపాటు, రైతన్నలకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు సరఫరా, పెట్టుబడి సాయం కింద రైతు భరోసా వంటివి. అందిస్తున్నామని తెలిపారు.

రైతులకు 500 బోనస్

సన్నాలు సాగు చేసిన రైతులకు 500 బోనస్, రైతు బీమా, పంట నష్టం జరిగితే పరిహారం ఇచ్చామని గుర్తుచేశారు. భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చామని రైతన్నల కోసం దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేసామని అన్నారు. ఈ సీజన్లో పంటలకు పెట్టుబడి సాయం తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు జమ చేశాము. తొమ్మిది రోజుల్లోనే 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.8,675 కోట్ల రూపాయలు ఆమ వేశాం అని ఆయన తెలిపారు. రైతు భరోసా మూలంగా రాష్ట్రంలో సాగు యోగ్యమైన 1.49 కోట్ల ఎకరాలకు 69.70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 9 వేల కోట్లు జమచేసి ప్రజా ప్రభుత్వం రైతుల జీవితాల్లో భరోసాను నింపిందని తెలిపారు. అన్నదాతల సంక్షేమం కోసం 24 గంటల ఉచిత విద్యుత్తు పథకం కింద నెలకు 900 కోట్ల చొప్పున అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 17,091 వేల కోట్లు రైతుల పక్షాన ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించిందని అన్నారు. ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్ ద్వారా రాష్ట్రంలోని 29.40 లక్షల మంది రైతులు లబ్ది పొందుతున్నారని తెలిపారు. రైతు భరోసా కింద నేటి వరకు 69.70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 21,763 కోట్ల రూపాయలు అందించాం. సన్నదాన్యం సాగు చేస్తున్న రైతులకు క్వించాకు 500 చొప్పున బోనస్ రూపంలో ఈరోజు వరకు 1,199 కోట్ల రూపాయలు రైతులకు ప్రజా ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. రైతన్నకు ఊహించని ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు రైతు బీమా పథకాన్ని అమలు అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద 42.16 లక్షల మంది రైతులకు భీమా అందించాము.

భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నేటి వరకు 50 కోట్లు వారి ఖాతాల్లో జమ దేశాం, ఇందిలా గిరి వికాసం ఈ పధకం కింద 2.1 లక్షల గిరిజన రైతులకు సోలార్ విద్యుత్ తో నడివే సాగునీటి పంపుసెట్లు, స్ప్రింక్లర్లు డ్రిప్పు, ఉద్యాన శాఖ ద్వారా ఉచితంగా అవకాడో, వెదురు పామాయిల్ వంటి మొక్కలను ఉచితంగా గిరిజన రైతులకు అందిస్తున్నాం. ఇందుకుగాను 12,600 కోట్లు ఖర్చు కేటాయించామని అన్నారు. పూర్తిగా రైతన్నల కోసం వేపట్టిన కార్యక్రమాలతో ప్రతి సంవత్సరం రైతుల కోసం 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. నిరుపేడ విద్యార్థులకు ప్రపం స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రతి పాఠశాల 25 ఎకరాల్లో రూ. 200 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నామని మొదటి సంవత్సరం 58 పాఠశాలలు నిర్మించేందుకు 11,600 కోట్లు కేటాయించామని తెలిపారు కోటి మంది మహిళలను ఐదు సంవత్సరాలలో కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నాం. మొదటి సంవత్సరం లక్ష్యాన్ని మించి 21,632 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాం.

56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

ఇప్పటికే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం అని తెలిపారు. మరో 30 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయనున్నామని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల వేసాం అని ప్రకటించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పేరిట తొమ్మిది వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 3.10 కోట్ల మంచి పేదలకు ఉగాది నుంచి సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ఇందుకుగాను ప్రజా ప్రభుత్వం ప్రతి సంవత్సరం 13,525 కోట్లు ఖర్చు చేస్తుంది. సామాన్య ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నాం. మహాలక్షి శ్రీ పథకం ద్వారా ఇప్పటివరకు 188 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు దేశారని చెప్పారు. ఆడబిడ్డల పక్షాన ప్రభుత్వమే ఆర్టీసీ సంస్థకు ఇప్పటివరకు 4,310 రూపాయలు రెల్లించింది. మహాలక్షి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ పధకం ద్వారా 42.90 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. సబిని కింద. రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన 580 కోట్లు ఇప్పటికే చెల్లించింది.

గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లు వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 50.77 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయి. వారి పజ్ఞాన ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు 2,050 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించింది. 22,500 కోట్ల రూపాయం అంచనా వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి కనీసంగా 3.500 చొప్పున మొత్తం రాష్ట్రంలో 4.50 లక్షల పిల్లు నిర్మిస్తున్నామని గణాంకాలతో వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు వరకు పెంచాం. పెంచడం మూలంగా రాష్ట్రంలో 90 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరిందని ప్రకటించార. ఇప్పుడు ఉన్న చికిత్సడే కాక జవనంగా మరో 163 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ వరిధిలోకి తీసుకు వచ్చాం. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేటి వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1,367 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలోని సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రాధాన్యత క్రమంలో వాటిని పూర్తి చేస్తామని. తెలిపారు. ఇందుకుగాను తాజా బడ్జెట్లో 23,373 కోట్లు కేటాయించాం. రాబోయే మూడేళ్లలో 17 వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులను 28 వేల కోట్లు తో అభివృద్ధి చేయనున్నాం. కొత్త పధకాలు కొనసాగించడమే కాదు గత ప్రభుత్వంలో ఉన్నవంక్షేమ పధకాలను కొనసాగిస్తున్నా మని తెలిపారు. కళ్యాణ లక్ష్మి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3.022 కోట్లు విడుదల చేయగా 1,68,225 మంది లబ్ది పొందారు. చేయూత పథకం కింద మన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 17,563 వేల కోట్ల ఖర్చు చేయగా 43.01 లక్షల మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఆర్థికంగా ప్రయోజనం పొందారని అన్నారు.

Read also: Kavitha: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జులై 17న రైల్ రోకో

#BhattiSpeech #BhattiVikramarka #InclusiveTelangana #PrajaPalana #TelanganaWelfare #WelfareBudget95351Cr #WelfareForAll Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.