📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Bhatti Vikramarka: హెచ్‌సీయూ విద్యార్థుల కేసుల తొలగింపుపై..భట్టి చెప్పినవి వట్టి మాటలేనా?

Author Icon By Sharanya
Updated: April 20, 2025 • 12:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థులు కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూమిలో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేపట్టారు. ఈ నిరసనల సమయంలో విద్యార్థులపై పోలీసులు కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రభుత్వం విద్యార్థులపై పెట్టిన అన్ని కేసులను ఉపసంహరించేందుకు నిర్ణయం తీసుకుంది .​

ప్రభుత్వ చర్యలు

ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, శ్రీనివాస్ రెడ్డి హెచ్‌సీయూ టీచర్స్ అసోసియేషన్ మరియు పౌరసమాజ ప్రతినిధులతో సమావేశమై, విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇది విద్యార్థుల నిరసనలకు మరియు పౌరసమాజ ఒత్తిడికి ప్రతిస్పందనగా తీసుకున్న చర్య. ఇకపై యూనివర్సిటీ క్యాంపస్‌లో పోలీసుల ఉనికి తగ్గించబడుతుంది, అయితే వివాదాస్పద 400 ఎకరాల భూమిలో మాత్రం పోలీసుల ఉనికి కొనసాగుతుంది .​

సుప్రీం కోర్టు ఆదేశాలు

సుప్రీం కోర్టు ఈ భూమిలో చెట్ల నరికివేతపై స్టే ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర అధికారుల కమిటీ (CEC) ఈ ప్రాంతాన్ని సందర్శించి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం భూమి అభివృద్ధి కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేసింది .​ఈ నేపథ్యంలో అన్ని కేసులను తక్షణమే కొట్టేస్తామని, విద్యార్థులకు కేసుల నుంచి విముక్తి కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క హామీ ఇచ్చి, రెండువారాలు కావొస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని గచ్చిబౌలి పోలీసులు చెప్తున్నారు. దీంతో భట్టి చెప్పినవన్నీ వట్టి మాటలేనని విద్యార్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇచ్చినమాటకు కట్టుబడి అక్రమ కేసులను కొట్టేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాల నుంచి బుల్డోజర్లను వెనక్కి పంపాలని మార్చి 30న విద్యార్థులు శాంతియుతంగా నిరసనకు దిగారు. వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేయగా వారు అక్కడి నుంచి కదలలేదు. దీంతో పోలీసులు విద్యార్థులను విచక్షణారహితంగా ఈడ్చుకెళ్లి వ్యాన్‌లో పడేశారు. ఆడపిల్లల దుస్తులు చిరుగుతున్నా పట్టించుకోకుండా జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఈక్రమంలో హెచ్‌సీయూ పీహెచ్‌డీ స్కాలర్స్‌ ఎర్రం నవీన్‌, రోహిత్‌ పోలీసుల చర్యలకు ప్రతిఘటించినందుకు వారిపై పలు కఠినమైన సెక్షన్‌లతో కేసులు నమోదు చేశారు. తమపై దాడి చేశారని, మాదాపూర్‌ ఏసీపీ శ్రీకాంత్‌రెడ్డి గాయపడ్డారని ఆరోపించారు. భారతీయ న్యాయ సంహితలోని 118(1), 132, 191(3), 329(3), 351(3) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించారు. 15 రోజుల తర్వాత వారు బెయిల్‌పై విడుదలయ్యారు. ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. తమపై అక్రమంగా పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతున్నారు. అదేరోజు మరో 54 మంది విద్యార్థులను గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి బీఎన్‌ఎస్‌ఎస్‌ 170 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం తమపై పెట్టిన అక్రమ కేసులను కొట్టేయాలని విద్యార్థులు కోరుతున్నారు. 25న మరోసారి విచారణ కోసం కోర్టుకు రావాలని చెప్పారు. కేసులు ఎప్పుడెప్పుడు కొట్టివేస్తారా అని నాతో పాటు నా కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తొందరలోనే స్పందించి మాపై పెట్టిన కేసులన్నింటినీ కొట్టేస్తుందని ఆశిస్తున్నాము.

Read also: Hydraa : రూ.3,900 కోట్ల భూమిని కాపాడిన బాలుడి లెటర్!

#BhattiPromises #BhattiVikramarka #CaseWithdrawal #HCUProtests #HCUStudents #StudentJustice Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.