ఉగాది పండుగ పూట ఖమ్మం జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరబోయే తీపి కబురు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లా రవాణా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. మారుమూల గ్రామాల నుంచి పట్టణాలకు మహర్దశ కల్పిస్తూ, జిల్లా సమ్మగాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసాధారణ చౌడవ చూపారు. ఆయన పట్టుదలతో జిల్లాలోని ఐదు ప్రధాన రహదారుల విస్తరణకు ఏకంగా రూ.594 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీని కోసం జీవో ఎంఎస్ 15 16032026 కూడా విడుదల చేశారు.
Read Also : Anakapalli crime: మైనర్ బాలికపై అత్యాచారం.. పోలీసుల అదుపులోకి నిందితుడు
ఈ నిధులతో కీలక మార్గాలను నాలుగు వరుసల రహదారులుగా అభివృద్ధి చేయనున్నారు. ప్రజా
ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే జిల్లా అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో ఐదు రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంలో ఆయన పాత్ర కీలకం. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు సౌకర్యవంతమైన రాకపోకలను కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను సులభతరం చేయడం లక్ష్యంగా రహదారుల విస్తరణను ప్రభుత్వం చేపడుతోంది. ఖమ్మం, వైరా, మధిర నియోజకవర్గంలో కరెక్టివిటీ పెరగండతో పాటు స్థానికంగా ఆర్ధిక వ్యవస్థకు ఊతం లభించనుంది. రవాణా ఖర్చులు తగ్గడంతో రైతులు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరనుంది. వైరా నుండి జగ్గయ్యపేట వరకు 25 కిమీ నిడివితో రహదారి విస్తరణచేయబోతున్నారు.

దీనికోసం రూ. 151.20 కోట్లు నిధులుమంజూరు చేశారు. కొత్తగా విస్తరించేవైనా రోడ్డు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ నాలుగు వరుసల రహదారిగా విస్తరణ జగ్గయ్యపేట, బోనకల్ రావినూతల, ముజఫర్ నగర్, జానకీపురం, పెద్దచీరపల్లి, పాలడుగు, సీతానగరం, గొల్లపూడి, రెబ్బవరం, తాటిపూడి, జింకల తండా, సోమవరం మీదుగా వైరా వరకు పోతుంది. మధిర నుంచి తూటికుంట్ల వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణ. మధిర, జిలుగుమాడు, అత్కూరు, కిష్టాపురం, సిరిపురం, కలకోట, బ్రాహ్యణపల్లి మీదుగా తూటికుంట్ల వరకు విస్తరణ చేస్తున్నారు. మధిరనుంచితూటికుంట్ల వరకు 13.50 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారి విస్తరణకు రూ. 81 కోట్ల నిధుల మంజూరు.
మధర నుంచి ఎర్రుపాలెం వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ. మధిర, ఎల్లెందులపాడు, దెందుకూరు,
మీనవోలు మీదుగా ఎర్రుపాలెం వరకు 18.40 కిమీ నిడివి కలిగిన రోడ్డును నాలుగు వరుసల రహదారి విస్తరణ చేయడానికి రూ.110.40 కోట్ల నిధులు మంజూరు. ఖమ్మం నుంచి బోనకల్ వరకు నాలుగు వరు సల రహదారి విస్తరణ, ఖమ్మం, కొత్తూరు, దంసలా పురం, గాంధీనగరం, రామకృష్ణాపురం, పందిళ్లపల్లి. జగన్నాథపురం, నాగులవంది, ముష్టికుంట్ల మీదుగా బోనకల్ వరకు 28.03 కిమీ రహదారి విస్తరణకు రూ.157.23 కోట్ల నిధుల మంజూరు చేస్తూ ఉత్తర్వులో పేరొక్కన్నారు. బోనకల్అళ్లపాడు, రాయన్నపేట వంగవీడు వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ. బోనకల్, ఆళ్లపాడు, రాయన్న పేట మీదుగా వంగవీడు వరకు 15.72 కి.మి రహదారి విస్తరణ చేస్తారు. 15-72 కిలోమీటర్ల మేర రహదానికి విస్తరణకు రూ.94.32 కోట్ల నిధుల మంజూరు అయ్యాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :