సత్తుపల్లి : సత్తుపల్లి సింగరేణి ఏరియాలోని జలగం వెంగళరావు(Bhatti Vikramarka) ఓపెన్ మైను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానందు, ఆధ్వర్యంలో డిప్యూటీ సిఎం మల్లుభట్టి విక్రమార్క, అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. మొదట వ్యూపాయింట్ నుంచి మైన్ పరిశీలించిన డిప్యూటీ సిఎం తదుపరి మైన్ లోపలికి వెళ్లారు. ఓపెన్ మైన్ను ఎలా ప్రారంభిస్తారు, ఎన్ని పొరలు ఉన్నాయి, మైన్లో బొగ్గు(Coal) ఎలా తీస్తారు, ఏ రకమైన బొగ్గు ప్రస్తుతం ఇక్కడ లభిస్తుంది, తీసిన బొగ్గును ఎలా బయటికి పంపిస్తారు, 24 గంటల పాటు మైన్ పనిచేస్తున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాకి సంబంధించి సౌకర్యాలు ఎలా ఉన్నాయి తదితర విషయాలను డిప్యూటీ సిఎం సింగరేణి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Read also: Singareni: సింగరేణి బలం కార్మికులే సిఎండి కృష్ణభాస్కర్
సిబ్బంది వేతనాలపై డి.సిఎం ఆరా
మొత్తం వాహనాలు ఎన్ని వినియోగిస్తున్నారు, శాశ్వత సిబ్బంది, కాంట్రాక్టు సిబ్బంది ఎంతోమంది ఉన్నారు. (Bhatti Vikramarka) వారి వేతనాల చెల్లింపు ఏ లెక్కల్లో చేస్తారు అనే విషయాలను డిప్యూటీ సిఎం సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మైన్లో ఉత్పత్తి అవుతున్న బొగ్గుకు మార్కెట్లో ఏ ధర పలుకుతుంది, బొగ్గు తీసే క్రమంలో రవాణా నేపథ్యంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపడుతున్నారు వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. మైన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నేరుగా కోల్ డిస్పాచ్ సెంటర్ కు వెళ్లి అక్కడి నుంచి బొగ్గు ఎలా బయటికి వెళ్తుంది ఏఏ ప్రాంతాలకు వెళ్తుంది తదితర వివరాలను డిప్యూటీ సిఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ సిఎం వెంట వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సిఎండి కృష్ణ భాస్కర్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్, సింగరేణి జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్, జే వి ఆర్ ప్రాజెక్ట్ అధికారి ఎన్విఆర్ ప్రహ్లాద్ ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: