సింగరేణి ఆస్తులను కొంతమందికి కట్టబెట్టే ప్లాన్ తో, కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా విషపు రాతలు రాస్తున్నారంటూ తెలంగాణ (TG) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషపు రాతల వల్ల రాష్ట్రానికి, సింగరేణికి నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. ఈరోజు ఉదయం ప్రజాభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. సింగరేణిపై అసత్య ప్రచారాల వెనక కుట్ర దాగి ఉందని, సింగరేణి ఆస్తులు కాజేసే ప్లాన్ ఉందని ఆరోపించారు.
Read Also: Telangana: ఘనంగా ముగిసిన ప్రభుత్వ జూనియర్ కాలేజీల పిటిఎం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నట్లు వెల్లడి
(Bhatti Vikramarka) టెండర్లపై అపోహలు సృష్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరి ప్రయోజనాల కోసం తప్పుడు రాతలు రాస్తున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రాబందుల నుంచి సింగరేణి ఆస్తులను కాపాడతానని ఆయన చెప్పారు. నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల వ్యవహారంపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ రాయడాన్ని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారణ జరిపిస్తానని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణిపై కిషన్ రెడ్డి పరిశీలిస్తేనే నిజాలు బయటపడతాయని చెప్పారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పినట్లుగా, కోల్ ఇండియా టెండర్ 2018లో కేంద్రం తయారు చేసిందే, సైట్ విజిట్ తప్పనిసరి నిబంధన అప్పట్లోనే ఉంది. 2021లో కూడా కేంద్ర గనుల శాఖ అదే నిర్ధారించింది. అయితే, పత్రికలు, నాయకులు, సోషల్ మీడియాలో భట్టి విక్రమార్క సూచనలవల్ల తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: