📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Konda Surekha Issue : ఖర్గేతో భట్టి భేటీ.. సురేఖపై చర్యలకు సిఫారసు?

Author Icon By Sudheer
Updated: August 27, 2026 • 9:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Konda Surekha Issue : తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్న మంత్రి కొండా సురేఖ వ్యవహారం అధిష్టానం వద్దకు చేరింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిన్న రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ మరియు ఆమె కుటుంబ సభ్యుల వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను భట్టి విక్రమార్క అధిష్టానానికి నివేదించినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ ఎపిసోడ్ వల్ల ఇప్పటికే పార్టీకి, ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని, అందుకే ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

Read Also : తాలిపేరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి

నివేదికపై ఆరా.. ఢిల్లీకి ముగ్గురు నేతలు?

మంత్రి సురేఖ వ్యవహారానికి సంబంధించి టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదికను తాను ఇప్పటికే పరిశీలించానని, పార్టీ క్రమశిక్షణే అత్యంత ప్రధానమని ఖర్గే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. అధిష్టానం వద్ద జరిగే ఈ సమావేశం అనంతరం కొండా సురేఖపై పార్టీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో అనే అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Konda Surekha controversy Mallikarjun Kharge Bhatti Vikramarka meeting Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.