📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దేవాదాయ శాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి టెంపుల్ !

Author Icon By sumalatha chinthakayala
Updated: February 27, 2025 • 10:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తక్షణమే ఈవోను నియమించాలని ఆదేశం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో చార్మినార్‌ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి రానుంది. ఈ మేరకు దేవాదాయశాఖను ట్రిబ్యునల్ ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భాగ్యలక్ష్మీ టెంపుల్ నిర్వహణ బాధ్యతను మహంత్ మనోహర్ దాస్, మహంత్ రాంచంద్ర దాస్ 1960 దశకం నుంచి చూస్తున్నారు. ప్రస్తుతం ఆలయ నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఆదేశాలు వెలువడ్డాయి. భాగ్యలక్ష్మీ ఆలయానికి తక్షణమే ఈవోను నియమించి ఆలయంలో ఎలాంటి అవకతవకలు లేకుండా ముందుకు వెళ్లాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ ఆలయ ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదులపై కోర్టు విచారణ తర్వాత ఈ ఆదేశాలు జారీ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఆలయ అభివృద్ధికి సహకారం

యూపీకి చెందిన రాజ్ మోహన్ దాస్ ఆలయంపై ఆజమాయిషీ చెలాయిస్తున్నాడంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఆలయ నిర్వహణకు సంబంధించి ఏకగ్రీవ నియంత్రణ ఉండాలని ఆమె కోర్టులో వాదించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఎండోమెంట్ ట్రిబ్యునల్, ఆలయాన్ని దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకురావాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో దేవాదాయశాఖ కమిషనర్ ఆలయ నిర్వహణకు ప్రత్యేక ఈవోను (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) నియమించాలని ఆదేశించారు. ఆలయ ఆదాయ వ్యయం, నిర్వహణ విధానాలు అధికారిక పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నిర్ణయంతో ఆలయ అభివృద్ధికి సహకారం అందుతుందని, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మార్గం సుగమమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Bhagyalakshmi Temple Breaking News in Telugu Devadaya Department Google news Google News in Telugu Latest News in Telugu Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.