ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యులకు సూచించారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తో శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు నర్సాపూర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఆకస్మిక పర్యటనల వల్ల మెరుగైన వైద్య సేవలు
వైద్యం ప్రమాణాలు మెరుగుపరిచేందుకే ఆకస్మిక పర్యటనలు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ లాంటి పర్యటనలతో వైద్యాధికారులు, సిబ్బంది క్రమశిక్షణగా విధులు నిర్వహించి
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడనికి తోడ్పడతాయన్నారు.