📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Bejjur police case: మహిళల అక్రమ రవాణా కేసు గుట్టురట్టు

Author Icon By Tejaswini Y
Updated: March 21, 2026 • 11:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bejjur police case: బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో మహిళల అదృశ్యం కేసు నమోదయింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతు ఉండగా, ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు బాధితులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించి సురక్షితంగా తీసుకువచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సిఐ సంతోష్ కుమార్ తెలిపారు.

Read Also : Air India, AI 185: 8 గంటల గాలిలో ప్రయాణం.. చివరకు ఢిల్లీలోనే ల్యాండింగ్

Bejjur police case: వివరాల ప్రకారం

బాధిత మహిళలు చెప్పిన వివరాల ప్రకారం ఇద్దరు యువతులు ఉద్యోగం కోసం మంచిర్యాల ప్రాంతంలో నివసిస్తున్న సమయంలో కిష్టంపేట్ గ్రామానికి చెందిన ముదిమాడుగుల ప్రశాంత్ అతని భార్య సవిత వారికి పని కల్పిస్తామని చెప్పి పరిచయం పెంచుకుని, మహారాష్ట్రకు చెందిన మహేష్ అనే వ్యక్తి సహాయంతో డబ్బు కోసం ఇతర ప్రాంతాల వారితో వివాహాలు జరిపిస్తామని ప్రలోభపెట్టారు. బాధితులు అంగీకరించక పోవడంతో నిందితులు కుట్ర పన్ని. వారిని బెదిరించి బలవంతంగా రైలులో ఎక్కించి మధ్య ప్రదేశ్ కు తీసుకెళ్లారు. అక్కడ, వారి ఇష్టానికి విరుద్ధంగా అక్కడి వారితో అమ్మాయిల మేనమామ అని చెప్పి దేవాలయంలో వివాహాలు జరిపించి, ఒక్కొక్కరి భర్త వద్ద నుండి రూ.2,50,000/ చొప్పున డబ్బు తీసుకుని మొత్తం రూ.5,00,000 అక్రమంగా లాభం పొందినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు.

అనంతరం బాధితులను అక్కడే వదిలి నిందితులు పరారయ్యారన్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు చేసిన నేరాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుండి బాదితులకు సంబందించిన మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంక్ పాస్ బుక్స్ వంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. మరొక నిందితుడైన మద్యప్రదేశకు చెందిన రాహుల్ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. మీడియా సమావేశంలో బెజ్జూర్ ఎస్ఐ సర్తాజ్ పాషా పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Bejjur police case forced marriage scam India human trafficking case Telangana job fraud marriage scam Madhya Pradesh women rescue Mancherial crime news Telangana Crime News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.