📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Gadwal : రైతులకు బేడీలు.. తెలంగాణ సర్కార్ సీరియస్

Author Icon By Sudheer
Updated: June 18, 2025 • 8:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గద్వాల జిల్లాలో పెద్దధన్వాడ మండలంలో ఏర్పాటవుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol Factory)కి వ్యతిరేకంగా రైతులు బహిరంగంగా నిరసన వ్యక్తం చేశారు. తమ భూములు కోల్పోతామని భయపడుతున్న రైతులు, ప్రాజెక్ట్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో భాగంగా పలువురు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కోర్టు ముందు అన్నదాతలకు సంకెళ్లు.. తీవ్ర విమర్శలు

అరెస్ట్ చేసిన రైతులను అలంపూర్ కోర్టుకు తీసుకెళ్లే సమయంలో పోలీసులు వారికి బేడీలు వేసారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. “అన్నదాతలకు సంకెళ్లు వేయడమేనా న్యాయం?” అంటూ ప్రజలు, విపక్షాలు పోలీస్ వ్యవహారాన్ని తీవ్రంగా విమర్శించాయి. సంఘటిత సంఘాలు, రైతు సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి.

సస్పెన్షన్ వేటు.. చర్యలపై సీఎం అప్రమత్తం

ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఒక ఆర్ఎస్సైతో పాటు ఇద్దరు ఏఆర్ఎస్సైలను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రజాస్వామ్యంలో రైతుల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని, శాంతియుతంగా నిరసన తెలిపిన రైతులకు ఈ విధంగా అవమానం చేయడాన్ని ప్రభుత్వం సహించబోమని స్పష్టం చేసింది.

Read Also : Yogandhra-2025 : ట్రాఫిక్ ఉచ్చులో విశాఖ

Ethanol Factory Case Google News in Telugu Pedda Dhanwada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.