📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

BC Welfare : బిసిలకు పెద్దపీట వేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదే

Author Icon By Shravan
Updated: July 29, 2025 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు

హైదరాబాద్ : దేశంలో చిత్తశుద్ధితో బిసిల సంక్షేమం కోసం పనిచేస్తున్నది ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వమే అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు (N.Ram chandar rao) అన్నారు. మోడీ ప్రభుత్వం కేబినెట్లో 27 మంది బిసి మంత్రులు ఉన్నారని తెలిపారు. బిసిలకు (BC) పెద్దపీట వేసింది… బిసి కమిషన్ న్ను తీసుకువచ్చింది కూడా మోడీ అని, రాహుల్ గాంధీ మాత్రం బిసిని అవమానపరిచేలా కన్వర్టెడ్ బిసి అంటూ విమర్శించడం దారుణం అన్నారు. బిసి జాబితాలు రాష్ట్రానికొకటిగా ఉండవని, రాష్ట్రాన్నిబట్టి జాబితాలు మారుతాయి. ఉదాహరణకు లంబాడాలు మన రాష్ట్రంలో ఎస్జీలు.. కానీ మహారాష్ట్రలో బిసిలు… నేను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కెసిఆర్ ఈ కమిషన్ ను ఏర్పాటు చేసినప్పటికీ, దానికి అవసరమైన నిధులు మాత్రం కేటాయించలేదు. కమిషన్కు కేవలం హోదా ఇచ్చారు గానీ, పనితీరుకు అవసరమైన ఆర్థిక మద్దతు కల్పించలేదన్నారు. ఇక కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం చేపట్టిన కుల గణన విషయానికొస్తే, అది రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియ కాదు, ఆ గణన కేవలం గణాంకాల సేకరణ మాత్రమే. ఎందుకంటే, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థల ద్వారా కాకుండా, ప్రభుత్వమే స్వయంగా నిర్వహిం చిన ప్రక్రియ. కులగణనకు సంబంధించి వివరా లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ బయట పెట్టక పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. మండలాల స్థాయిలో కులగణన చేయలేదని అనేకమంది టీచర్లు చెబుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ వివరాలను బయట పెట్టే ఉద్దేశం కనబడడం లేదు. కులగణనన అధికారికంగా చేయాలంటే, అది రాజ్యాంగ బద్ధమైన సంస్థలతో, సరైన డేటా ద్వారా చేయాల్సి ఉంటుందన్నారు. భారతీయ జనతా పార్టీ కులగణనకు వ్యతిరేకం కాదన్నారు. విశ్వకర యోజన, ముద్రా రుణాలు, స్టార్టప్ ఇండియా వంటి వివిధ పథకాలలో అధికంగా లబ్దిదారులు బిసిలే కావడం స్పష్టంగా కనిపిస్తుం దన్నారు. ఈ వాస్తవం మోడీ ప్రభుత్వం బిసిల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్న విషయాని నిరూపిస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ ఓబిసిల సంక్షేమం పట్ల పూర్తి నిబద్ధతతో ముందుకెళ్తుందన్నారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Cultural Movement : బిసిల సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం

BC Policies India BC welfare Breaking News in Telugu Indian Political Support BCs Latest News in Telugu Social Justice Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.