BC Reservations: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. బీసీ హక్కుల సాధన కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ అంశంలో అఖిలపక్షంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లులకు ఆమోదం లభించేలా ప్రధాని మోదీపై సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడి తేవాలన్నారు. విద్యార్థుల పరీక్షలను పట్టించుకోకుండా వరుస ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదని విమర్శించారు. బడ్జెట్‌లో ఏటా బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీని సీఎం రేవంత్ నిలబెట్టుకోవాలన్నారు.
Read Also: TG EDCET-2026: టీజీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల
అగ్రకులాలకే ప్రాధాన్యం
బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహం అసలైన ప్రతీక కాదని, ప్రజలపై బలవంతంగా ప్రతీకను రుద్దే ప్రభుత్వాన్ని వారు అంగీకరించరని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కార్పొరేషన్ పదవుల్లో అగ్రకులాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. అలాగే గెలవలేని బీసీ, మహిళ, మైనార్టీలకు అవకాశాలు కల్పించాలని కోరారు. ట్యాంక్‌బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి స్థలం కేటాయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: