📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

BC Reservations: బిసి రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్లో స్పష్టతనివ్వాలి – మంత్రి పొన్నం తో బిసి నేతల భేటీ

Author Icon By Sharanya
Updated: July 11, 2025 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బిసి రిజర్వేషన్ల (BC Reservations) పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని బిసి సంక్షేమ సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళ్లాలని సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని సంఘం నాయకులు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) గురువారం విజప్తి చేశారు.

బిసి నేతల సమావేశం

బిసి కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బిసి యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం కుర్మా, సంఘం నాయకులు జాజుల లింగం గౌడ్, బూడిద మల్లికార్జున యాదవ్, పానుగంటి విజయ్ కూడిన ప్రతినిధుల బృందం మంత్రుల నివాసం లో మంత్రి పొన్నంతో భేటీ అయ్యారు. రాష్ట్ర జీవో నిలబడదనే విషయాన్ని ప్రభు త్వం గ్రహించాలన్నారు. బిసి రిజర్వేషన్లకు రాజ్యాంగ పద్ధతి రావాలంటే ఖచ్చితంగా తమిళ నాడు రాష్ట్ర తరహాలోనే తొమ్మిదవ షెడ్యూల్లో బిసి రిజర్వేషన్లు (BC Reservations) ప్రభుత్వం తాత్కాలిక పద్దతిన బిసి రిజర్వేషన్ల పెంపు కోసం జీవో తీసుకురావాలని ఆలోచిస్తుందని కానీ భవిష్యత్తులో న్యాయ పరంగా ఈ అంశాన్ని చేర్చి బిసిలకు విద్యా ఉద్యోగ (Education jobs for BCs) రాజకీయ రంగాల్లో 42 శాతం పెంచాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపు కోకుండా.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఈనెల 21 నుండి ఢిల్లీలో జరిగే పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి బిసి రిజర్వేషన్లు విధంగా పెంచే ప్రభుత్వ కార్యాచరణ ఉండాల న్నారు. బిసి రిజర్వేషన్లు 42 శాతం పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వ హించాలని.. రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబడుతుందని హెచ్చ దీర్ఘకాలికంగా బిసి రిజర్వేషన్లకు రించారు. రాజ్యాంగ భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసు కువస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చినట్టు బిసి సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు .

పొన్నం ప్రభాకర్ ఏ శాఖలకు మంత్రి?

పొన్నం ప్రభాకర్ గౌడ్ భారతీయ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆయన తెలంగాణలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు.

పొన్నం ప్రభాకర్ గారి గురించి?

పొన్నం ప్రభాకర్ గౌడ్ (పుట్టింది: 8 మే 1967) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన 15వ లోక్‌సభకు సభ్యునిగా ఎన్నికై సేవలందించారు. అదేవిధంగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా పని చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Jagan Mohan Rao: హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావుకు రిమాండ్

BCReservations BCRights CabinetDecisions latest news PonnamPrabhakar RevanthReddy TelanganaPolitics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.