📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

BC Reservations: బిసిలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్

Author Icon By Digital
Updated: August 30, 2025 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చట్టబద్ధమైన రిజర్వేషన్ల డిమాండ్

హైదరాబాద్ : రాష్ట్రంలో బిసిలకు(BC Reservations) చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలని.. పార్టీపరమైన రిజర్వేషన్ వద్దని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్(Jajula Srinivas Goud)డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపరంగా బిసిలకు 42 శాతం కేటాయిస్తామంటే ఊరుకునేది లేదని.. పార్టీపరంగా టికెట్లు ఇచ్చే దానికి అయితే 20 నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు ఆపినట్టని ప్రశ్నించారు. శనివారం జరిగే క్యాబినెట్ సమావేశంలో చట్ట బద్ధంగా బిసిలకు రిజర్వేషన్ కల్పించడానికి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం, క్యాబినెట్‌పై డిమాండ్లు

క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రి మండలి మొత్తం రాష్ట్ర గవర్నర్ని కలిసి బిసి రిజర్వేషన్లపై వత్తిడి పెంచాలని.. మంత్రివర్గ ఉప సంఘం కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం బిసిలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని.. గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించడానికి అసెంబ్లీ సమావేశాల్లో బిసి రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేయాలన్నారు. బిసి రిజర్వేషన్లపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలు, బిసి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

రాజకీయ మరియు న్యాయపోరాటం అవసరం

బిసి రిజర్వేషన్లపై(BC Reservations) రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు న్యాయపోరాటం.. మరొకవైపు రాజకీయ పోరాటం చేయాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. బిసి రిజర్వేషన్లు పెంపుపై చట్టబద్ధంగా సాధ్యం కాకపోతే.. చివరి అవకాశంగా మాత్రమే పార్టీపరంగా బిసిలకు టికెట్లు కేటాయింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలన్నారు. బిసి రిజర్వేషన్లు పెంచకపోతే బిసి కులగణనకు అర్థం లేదన్నారు. దేశంలో రోల్ మోడల్ అని చెప్పి .. ఇప్పుడు తీరా పార్టీ పరంగా టికెట్లు ఇస్తామంటే, ఇది ఓల్డ్ మోడల్ అవుతుందన్నారు.

బీహార్ ఉదాహరణ మరియు కాంగ్రెస్ భవిష్యత్

బీహార్ లో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావాలంటే .. తెలంగాణలో బిసి రిజర్వేషన్లను పెంచి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తేనే బీహార్లో బిసిలు కాంగ్రెస్ను విశ్వసిస్తారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బిజెపి బిసిలకు చేస్తున్న మోసంపై దేశవ్యాప్తంగా పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ బిసిలతో కలిసి రావాలన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం

నేటి జరిగనున్న అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ సమయాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

జాజుల శ్రీనివాస్ గౌడ్ ఏమి డిమాండ్ చేశారు?
బిసిలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు ఇవ్వాలని, పార్టీపరమైన రిజర్వేషన్లు వద్దని డిమాండ్ చేశారు.

క్యాబినెట్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలని కోరారు?
బిసిలకు చట్టబద్ధమైన రిజర్వేషన్ కల్పించడానికి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

బిసి రిజర్వేషన్లపై ఆయన సూచించిన పోరాటం ఏమిటి?
ఒకవైపు న్యాయపోరాటం, మరొకవైపు రాజకీయ పోరాటం చేయాలని సూచించారు.

బీహార్ కాంగ్రెస్‌పై ఏ వ్యాఖ్య చేశారు?
తెలంగాణలో బిసి రిజర్వేషన్లు పెంచి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తేనే బీహార్‌లో బిసిలు కాంగ్రెస్‌ను విశ్వసిస్తారని అన్నారు.

Read hindi news: Hindi.vaartha.com

Read also:

https://vaartha.com/politics-jagan-is-modis-adopted-son-thats-why-the-cbi-is-suppressing-his-voice/andhra-pradesh/538139/

BC Reservations BC Welfare Association congress party Jajula Srinivas Goud Legal Reservations Political Fight for BCs Politics News Telangana BC Reservations Telangana news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.