📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

Author Icon By Sharanya
Updated: July 11, 2025 • 4:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన తాజా సమావేశంలో పలు చారిత్రక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలోని బీసీ (BC) వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లను (BC Reservations) కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను (Local body elections) నిర్వహించాలని తీర్మానించడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా నిలిచింది.

ఇప్పటి వరకు బీసీలకు స్థానిక సంస్థలలో 34 శాతం వరకు మాత్రమే రిజర్వేషన్ ఉన్నా, ప్రభుత్వం ఈసారి దాన్ని 42 శాతానికి పెంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు 2018 చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ తీసుకురావాలని తీర్మానించింది. బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును శాసనసభ ఆమోదించి, గవర్నర్‌, కేంద్రానికి పంపినప్పటికీ దాని ఆమోదానికి కేంద్రం అనేక అడ్డంకులు సృష్టిస్తోందని కేబినెట్‌ భేటీ (Cabinet meeting) తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు. ఈ కారణంగానే ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించినట్టు తెలిపారు.

రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలులో కొత్త పద్ధతి:

బీసీల రిజర్వేషన్‌ (BC Reservations) లు అమలు చేసే క్రమంలో స్థానిక సంస్థలను మూడు స్థాయిలుగా పరిగణిస్తారు. రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలకు మండలం యూనిట్‌గా, ఎంపీపీ, జడ్పీటీసీలకు జిల్లా యూనిట్‌గా, జడ్పీ ఛైర్మన్లకు రాష్ట్రం యూనిట్‌గా పరిగణించనున్నారు.

రాష్ట్రంలో విద్యా రంగానికి బూస్ట్

ఈ సమావేశంలో కొత్తగా అమిటీ, సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ ప్రైవేట్‌ విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదా ఇచ్చేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. అమిటీ యూనివర్సిటీలో రాష్ట్ర విద్యార్థులకు 50 శాతం అడ్మిషన్లకు అవకాశం కల్పించాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది.

ఇతర కీలక నిర్ణయాలు:

సంగారెడ్డి జిల్లాలో జిన్నారం, ఇంద్రీశం మున్సిపాలిటీల పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయతీలను డీ లిస్టింగ్ చేసేందుకు ఆమోదం తెలిపింది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి వివరించారు.

ప్రతి మూడు నెలలకు రివ్యూ

కేబినెట్​లో పలు ముఖ్యమైన అంశాలకు సంబంధించి చర్చ జరిగిందని పొంగులేటి వెల్లడించారు. ఇవాళ్టితో కలిపితే మొత్తం 19 కేబినెట్‌ సమావేశాలు నిర్వహించామన్నారు. ఇప్పటివరకు 321 అంశాలను కేబినెట్‌ ఆమోదించింది. గత కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలపై ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తామని పొంగులేటి తెలిపారు. గత కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలపై ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కులగణనను విజయవంతంగా పూర్తి చేశాం. దేశానికే ఆదర్శంగా కులగణనను పూర్తి చేశామని పొంగులేటి వివరించారు. రాష్ట్రంలో 17 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్​ క్యాలండర్​ సిద్ధంగా ఉందని మరో మంత్రి పొన్నం ప్రభాకర్​ వెల్లడించారు. వచ్చే మార్చిలోపు లక్ష ఉద్యోగాలు ఇచ్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయించినట్లుగా తెలిపారు. మీడియా సమావేశంలో వీరితో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలు పాల్గొన్నారు .

తెలంగాణలో బీసీ శాతం ఎంత?

తెలంగాణలో బీసీ జనాభా 56.36 శాతంగా ఉందని ఆయన అన్నారు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీని నెరవేర్చిందని పునరుద్ఘాటించారు.

తెలంగాణలో బీసీ ఈ రిజర్వేషన్లు ఏమిటి?

రెండవ బిల్లు – తెలంగాణ వెనుకబడిన తరగతుల (గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల్లో సీట్ల రిజర్వేషన్) బిల్లు 2025 – గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలకు 42% BC కోటాను పొడిగిస్తుంది

Read hindi news: hindi.vaartha.com

Read also: BC Reservations: బిసి రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్లో స్పష్టతనివ్వాలి – మంత్రి పొన్నం తో బిసి నేతల భేటీ

42PercentQuota BCQuotaTelangana BCReservations Breaking News CasteCensus latest news LocalElections TelanganaPolitics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.