📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

BC Hostels: బిసి హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని ఆనంద్ గౌడ్ డిమాండ్

Author Icon By Sharanya
Updated: July 24, 2025 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి బిసి గురుకులాలో (BC Hostels) పరిస్థితలు దారుణంగా ఉన్నాయని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ అన్నారు. బిసి కమిషన్ చైర్మన్ నిరంజన్ను కలిసి వినతి పత్రం అందిం చారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

గురుకులాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

రాష్ట్రంలోని గురుకులాలలో(BC Hostels) ఫుడ్ పాయిజన్ (Food poisoning) ఘటనలు, పాములు, తేళ్ల వంటి విషపు పురుగుల వల్ల మరణించిన ఘటనలతో పాటు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మరికొన్ని చోట్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. విషయాలపై గతంలో కూడా మేము అనేకసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాం. కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని ఒత్తిడి చేశామన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే మేము అధికారులను కలిసి మరోసారి విజప్తి చేశాం. ఈ మళ్లీ ఏర్పడకూడదని చెప్పాం. కానీ ఈ 10 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ బిసి గురుకులాలలో దాదాపు 10మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి (Students are ill) గురయ్యారు.

వారిలో ఏడుగురు ఇప్పటికే మృతి చెందగా, ఇద్దరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఒక విద్యార్థికి రెండు కాళ్లు, నడుము విరిగిపోయిన పరిస్థితి విషమంగా ఉంది. రాష్ట్రంలోని దాదాపు 70 బిసి గురుకులా లలో తగిన నీటి సౌకర్యం లేదని, వేలాది మంది విద్యార్థులు ఉన్న చోట్ల కనీస వసతులు లేవు అన్నారు. ఈ పరిస్థితులను బిసి కమిషన్ గమనించి, ప్రత్యక్షంగా పరిశీలించి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మేము విజప్తి చేశాం. ఈ విద్యార్థుల జీవితాలను కాపాడేందుకు బిసి కమిషన్ ముందుండి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తగిన చర్యలు తీసుకునేలా చూడాలని కోరామన్నారు. దీనికి బిసి కమిషన్ చైర్మన్ సాను కూలంగా స్పందించారని తెలిపారు.

ఆనంద్ గౌడ్ ఎవరూ? ఆయన ఈ డిమాండ్ ఎందుకు చేశారు?

ఆనంద్ గౌడ్ బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా, సామాజిక సేవా కార్యకర్తగా ఉన్నారు. బిసి విద్యార్థులు హాస్టళ్లలో ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ ఆయన ప్రభుత్వాన్ని మౌలిక వసతులు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు

Read hindi news: hindi.vaartha.com

Read also: Supreme Court: అడవులను కాపాడకుంటే మీరు జైలుకే: సుప్రీంకోర్టు

Anand Goud BC welfare BC hostel sanitation BC hostels Telangana BC students hostel issues Breaking News latest news Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.