BC Gurukula Students Win : జాతీయస్థాయి టి స్కాన్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీల్లో బిసి గురుకుల విద్యార్థులకు పతకాలు

Read Time:  1 min
BC Gurukula Student Win
BC Gurukula Student Win
FONT SIZE
GET APP

T-Scan

జాతీయ స్థాయిలో జరిగిన టి స్కాన్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీల్లో బిసి గురుకుల విద్యార్థులు బంగారు, వెండి పతకాలు సాధించారు. యాచ్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ ఓపెన్ రెగట్టా ఆప్టిమిస్ట్ మెయిన్ ప్లీట్ విభాగంలో చాంద్రాయణ గుట్ట గర్ల్స్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న జె శిరీష వెండి పతకం సాధించగా, మునుగోడు బాయ్స్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న వి హనుమంతు కాంస్య పతకం సాధించాడు. కల్వకుర్తి గర్ల్స్ స్కూల్ లో ఏడవ తరగతి చదువుతున్న ఎం అక్షర జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయి పోటీలో పతకాలు సాధించిన విద్యార్థులను బిసి సంక్షేమ శాఖ మంత్రి (PONNAM PRABHAKAR) పొన్నం ప్రభాకర్, కార్యదర్శి శ్రీధర్, మహాత్మా జ్యోతిబా పూలే బిసి గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు అభినందించారు. బిసి గురుకులవిద్యార్థులకు చదువుతో పాటు వారిలోనైపుణ్యాలను, ఆసక్తిని గమనించి అనేక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు బిసి గురుకుల విద్యాసంస్థ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని సొసైటీ సెక్రటరీ సైదులు తెలిపారు. అందులో భాగంగా బిసి గురుకుల విద్యార్థులకు యాచ్ క్లబ్ ఆద్వర్యంలో హుస్సేన్ సాగర్ లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.

శిక్షణలో అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వడంతో పాటు వారు జాతీయ, అంతర్జాతీయపోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చామన్నారు. జూలై 1వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు మూడో విడత శిక్షణ ఇచ్చామని వారిలో జాతీయ స్థాయిలో ముగ్గురు విద్యార్థులు పతకాలు సాధించడం ఆనందంగా ఉందని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను 2026 లో జరిగే ఆసియన్ గేమ్స్, 2028 జరిగే ఒలింపిక్స్లోలో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. అందుకు అవసరమైన శిక్షణ అందిస్తామని తెలిపారు.

READ MORE :

https://vaartha.com/tg-engineering-engineering-college-sanctioned-to-telangana-university/telangana/524123/

Shravan

రచయిత గురించి

Shravan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.