📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

BC Bill : పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ – ఢిల్లీలో భారీ ప్రదర్శన

Author Icon By Shravan
Updated: August 19, 2025 • 2:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ BC Bill : పార్లమెంట్లో బి.సి బిల్లు పెట్టి చట్టసభలలో బి.సిలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బిసిలకు రిజర్వేషన్లు పెట్టాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం (B.C. Welfare Association) ఆధ్వర్యంలో ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన జరిపారు. ఈ మహాప్రదర్శనలో పార్లమెంట్ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్, జిల్లపల్లి అంజి, పగిళ్ల సతీష్ తదితర బిసి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పార్లమెంటు రావడంతో జంతర్ మంతర్ దద్దరిల్లిపోయింది.

ఈ సందర్భంగా ఎంపి ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ‘కేంద్రంలోని ప్రభుత్వం తొలిసారిగా జనగణనలో కులగణన చేపడుతుంది. కుల గణన తర్వాత బిసిలకు చట్టసభలలో 50 రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు పెంపు వంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. బి.సి.లు అన్ని రంగాలలో అభివృద్ధి మోడీ ద్వారానే జరుగుతుందన్నారు. బిసిలకు రిజర్వేషన్లను (Reservations for BCs) జనాభా గ్రూపులుగా వర్గీకరణ చేయడానికి జస్టిస్ రోహిణి అధ్యక్షతన కమిటీ నియమించారని, ఆ రిపోర్ట్ ప్రకారం గ్రూపులు చేస్తున్నారు. అలాగే ప్రత్యేక సంక్షేమ పథకాల రూపకల్పన, అవసరమైన బడ్జెటు కేటాయింపు, కార్యాచరణ ప్రణాళిక అమలులో ముందడుగు వంటివాటికి మార్గం సున్పష్టం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పంచాయతీరాజ్ సంస్థలో బి.సి. రిజర్వేషన్లను 22శాతం నుంచి 50 శాతంకు పెంచాలి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు.

బిసిల అభివృద్ధికి బిసి యాక్ట్, ప్రత్యేక మంత్రిత్వ శాఖ డిమాండ్

బిసిల విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ను తొలగించాలని, బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బిసిల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలని, ఎసీ, ఎస్టీ అట్రా సిటీ యాక్ట్ మాదిరిగా బిసిలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బిసి యాక్ట్ తీసుకురావాలని కోరారు, జడ్జీల నియామకాలలో ఎస్సీ, ఎస్టీ బిసిలకు రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో బిసిలకు పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ స్కీము విధానం సాచురేషన్ పద్దతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కేంద్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ బిసిసబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/airport-survey-completed-for-kuppam-airport/andhra-pradesh/532493/

BC Bill BC Community Rights Breaking News in Telugu Indian Politics Latest News in Telugu reservation bill Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.