📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

Government Schools: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి-విద్యార్థి, యువజన సంఘాలు విజప్తి

Author Icon By Sharanya
Updated: July 11, 2025 • 12:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో (Government Schools) మౌళిక సదుపాయాలు కల్పించాలిలని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFA) , భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఎ), తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ (టిపిటిఎల్ఎఫ్) డిమాండ్ చేశాయి. రాష్ట్రంలోని అన్నీ ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ రెండవ శనివారం తప్పకుండా సెలవు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సంఘాలు గురువారం పాఠశాల విద్య డైరక్టర్ నవీన్ నికోలసికి విజప్తి చేశాయి.

విద్యార్థి సంఘాలు విజప్తి

డైరెక్టర్ని కలిసిన వారిలో టిపిటిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఏ విజయ్ కుమార్, ఎస్ఎఫ్ఎఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, అధ్యక్షులు రజనీ కాంత్, డివైఎఫ్ఎ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, అధ్యక్షుడు కోట రమేష్, టిపిటిఎల్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమ్ము విజయ్, డి సైదులు, పి.విజయ్. ఎస్ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్, డివైఎఫ్ ఐ నాయకులు హష్మీ ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు (Government Schools) ప్రారంభం అయినప్పటికీ విద్యార్థులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూని ఫామ్ (ఒక్క జత మాత్రమే అందించారు) అందించ లేదని వాటిని పంపీణి చేయాలని నాయకులు డైరక్టర్ని కోరారు. ఉర్దూ మీడియం, కన్నడ, మరాఠీ మీడియం పాఠ్యపుస్తకాలు కూడా అంద లేదన్నారు. ఇంకా మధ్యాహ్నం భోజనానికి నిధులు కూడా సరిపడా ఇవ్వడం లేదని రన్నింగ్ వాటర్ సౌకర్యం లేదని. శానిటరీ నాప్ కిన్ అందించ లేదన్నారు. అన్నీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలు ప్రతి నెల రెండవ శనివారం సెలవు ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ సెలవు ఇవ్వడం లేదన్నారు.

రెండవ శనివారం సెలవు ఇవ్వకుండా అటు విద్యార్థులను, ఇటు టీచర్లను వేధిస్తున్న పరిస్థితి ఉందని కాబట్టి రెండో శనివారం సెలవు దినం తప్పక అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఫీజులు దందా కోనసాగుతుందని.. ఎల్కెజి నుండే లక్షలాది రూపాయలు వసూళ్లు చేస్తున్నారని ఫీజులపై నియంత్రణ లేదని, ఫీజులను నియంత్రణ చేయాలన్నారు. పాఠ్యపుస్తకాలు ఓపెన్ దుకాణం పెట్టి మరి అమ్ముతున్నారని వాటిని పర్యవేక్షణ చేసి చర్యలు తీసీకోవడంలో అధికారులు విఫలం చెందు తున్నారని మండిపడ్డారు. పేద విద్యార్థులకు ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలో 25 శాతం ఉచితంగా విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రవేశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్య డైరక్టర్కి విజప్తి చేశారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Prabhakar Rao: ప్రభాకర్ రావుకు ఉన్న రిలీఫ్ రద్దు చేయండి

BasicFacilities Breaking News GovernmentSchools latest news StudentRights TelanganaEducation Telugu News YouthDemand

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.