📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య

Basheerabad Surrogacy Case: పేట్ బషీరాబాద్ సరోగసి కేసు సంచలనం

Author Icon By Anusha
Updated: August 18, 2025 • 11:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏజెంట్లుగా నిందితులు.. పలు ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు

హైదరాబాద్ (పేట్ బషీరాబాద్): రెండు తెలుగు రాష్ట్రాల్లో సరోగసి కేసులు వేల సంఖ్యలో వెలుగులోకి వస్తుండటం, అటూ అధికారులను ప్రజలను ఆశ్యర్యానికి గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, ముందుకు దూసుకెళ్లున్నారు. తాజాగా మేడ్చల్ సరోగసి కేసును సుమోటో కేసుగా తీసుకుని పేట్ బషీరాబాద్ (Pet Basheerabad) పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పేట్ బషీరాబాద్ పరిధిలో వెలుగులోకి వచ్చిన సరోగసి రాకెట్ కేసు దర్యాప్తు వేగం అందుకుంది. ఈ కేసులో నిందితురాలు లక్ష్మి. ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి పలు ప్రైవేట్ ఆస్పత్రులకు ఏజెంట్లుగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పేట్ బషీరాబాద్ పోలీసులు పలు ప్రముఖ ఆస్పత్రులు, ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు హెల్త్ హాస్పిటల్, లక్స్ హాస్పిటల్, అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్ ఐవిఎఫ్ సెంబర్, ఫర్డ్ కేర్, శ్రీ ఫెర్టిలిటీ, అమూల్య ఫెర్టిలిటీ సెంటర్లకు శనివారం నోటీసులు అందజేశారు.

ఇంకా వెలుగులోకి రాబోయే అంశాలు..

ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సరోగసి మురా ఈ ఆసుపత్రుల ద్వారా చందా కొనసాగించిన అమాశాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై స్పష్టత కోసం ఆయా ఆసుపత్రుల యాజమాన్యానికి నోటీసులు పంపినట్లు సమాచారం.దర్యాప్తు కొనసాగుతున్న దశలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరి ఆర్థిక అవసరాలు, ఇబ్బందులను, మరొకరి సంతాన సాఫల్యత కలను క్యాష్ చేసుకుంటున్నాయి. భర్తప్రాణాలను రక్షిందుకునేందుకు సరోగసి (Surrogacy) కి ఒప్పుకుంటే.. మరొక యువతి కుటుంబ అవసరాల కోసం అండం డొనేట్ చేసేందుకు ఒప్పుకుంది. ఇలాంటి అనేక విషయాలు సరోగసి అక్రమ దందా కేసులో వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నీ ఆపరేషన్ కోసం సరోగసి ఆక్రమ దందా కేసులో గర్భవతిగా ఉన్న ఒ మహిళ తన భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు సరోగసికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన ఈమెకు ఇప్పటికి ఇద్దరు పిల్లలున్నారు.

Basheerabad Surrogacy Case

అండానికి రూ.10 వేలు

భర్తకు రెండు కిడ్నీలు పాడవడంతో ఆపరేషన్ వేయాల్సి ఉంది. ఎవరూ సహకరించక పోవడంతో ఆమె సరోగసి దందా చేస్తున్న నారెద్దుల లక్ష్మీ సంప్రదించింది. మహిళ అవసరాన్ని తెలుసుకుని అందుకు సహకరిస్తానని చెప్పి అన్నట్టుగానే భర్తకు ఆపరేషన్ చేయించింది. దీనికి సుమారు రూ.15 లక్షల వరకు చెల్లించినట్లు తెలుస్తుంది. తర్వాత బాధిత మహిళకు సరోగసి వేయించి ఆమెను పద్మానగర్లో ఉన్న తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించింది.సరోగసి అక్రమ దందా చేస్తున్న మహిళ ఒక్కో అండ దానానికి రూ.10 వేలు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. నెలలో మహిళ మూడు అందాలను ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి మొత్తంగా రూ.30 వేలు బాధిత మహిళలకు అందిస్తుంది. ఈ క్రమంలోనే ఓ యువతి వద్ద నుంచి అండం సేకరిస్తున్న క్రమంలో విషయం బయటకు వచ్చినట్టు సమాచారం.

ఎవరు సరోగసి చేయించుకోవచ్చు?

సంతానం లేని భారతీయ వివాహిత జంటలు మాత్రమే కొన్ని నిబంధనల కింద సరోగసి చేయించుకోవచ్చు. సింగిల్స్, లైవ్-ఇన్ పార్ట్నర్స్, విదేశీయులు భారతదేశంలో సరోగసి చేయించుకోవడానికి అనుమతి లేదు.

సరోగసి పట్ల సమాజంలో స్పందన ఎలా ఉంది?

కొందరు దీన్ని సంతానం కోసం ఆశీర్వాదంగా భావిస్తారు. అయితే, వాణిజ్యపరమైన దుర్వినియోగం కారణంగా చాలామంది దీన్ని జాగ్రత్తగా చూడాలని భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/sangareddy-district-four-year-old-boy-dies-after-falling-from-building/crime/531546/

Breaking News FIR registered Hyderabad surrogacy case Illegal Surrogacy latest news Medchal surrogacy racket Pet Basheerabad police Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.