ఈరోజు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ‘‘అఖండ 2 తాండవం’’ సినిమాను బండి సంజయ్ (Bandi Sanjay) వీక్షించారు. ‘అఖండ 2’ సినిమా చూసిన తర్వాత ఇన్ని రోజులు తన జీవితం వృధా చేసానని అనిపించిందని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. “ఇన్ని రోజులు నా జీవితాన్ని, సమయాన్ని వృథా చేసుకున్నా.. కనీసం ఇప్పటి నుంచైనా.. మిగిలిన జీవితాన్ని ధర్మానికి అర్పించాలి.. ధర్మం కోసం పని చేయలే.. దేశం కోసం పనిచేయాలని.. 100 శాతం ఆలోచన తెప్పించే సినిమా అఖండ-2” అని తెలిపారు.
Read Also: Peddi Movie: ‘పెద్ది’ చిత్రంలో ‘అప్పలసూరి’గా జగపతిబాబు
ప్రతి హిందువు, భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా
సీనియర్ ఎన్టీఆర్ గారిని మైమరిపించేలా బాలకృష్ణ యాక్టింగ్ చేస్తున్నాడని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బాలకృష్ణలో సీనియర్ ఎన్టీఆర్ ని చూసుకుంటున్నామని, ‘అఖండ 2’ సినిమాలో బాలకృష్ణను చూస్తే పరమేశ్వరుడే ప్రత్యక్షం అయ్యాడనిపించింది బండి సంజయ్ పేర్కొన్నారు. ‘అఖండ తాండవం సినిమాను ప్రతి హిందువు, భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో బాలకృష్ణ అద్బుతంగా నటించారు. బాలయ్య సినిమాల కోసం విద్యార్థులు, కాలేజీలు, యువకులు బెట్టింగులు పెట్టి మరీ వెళుతున్నారు.
ఈ సినిమాను అందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సనాతన ధర్మాన్ని కాపాడేలా మరిన్ని సినిమాలు రావాలి. ఈ దేశంలో అంతర్గతంగా జరుగుతున్న దాడులను, పరిస్థితులను ఆసరాగా చేసుకుని సినిమాలు తీసి ప్రజలను మేల్కోల్పాల్సిన అవసరం ఉంది. కొంత మంది ధర్మం విషయంలో దారి తప్పుతున్నారు. దేవుడు లేడు, హిందూ సనాతన ధర్మం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారందరికీ అఖండ 2 సినిమా గుణపాఠం. అటు ఇటు దారి తప్పిన వాళ్లంతా హిందూ ధర్మమనే గొడుగు కిందకు రావాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: