తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మరోసారి భారీ సంచలనం రేగింది. బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రతరమవుతోంది. ముఖ్యంగా బీజేపీ సీఎం రమేశ్ (CM Ramesh) చేసిన ఆరోపణలపై బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) గారు తీవ్రంగా స్పందించారు.
“సీఎం రమేశ్ ఆరోపణలు నిజమే” – బండి సంజయ్ ధ్రువీకరణ
బండి సంజయ్ (Bandi Sanjay) ప్రకారం, సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని, సిరిసిల్ల టికెట్ రావడానికి సీఎం రమేశ్ కేటీఆర్‌కు ఆర్థికంగా సాయం చేశారని, దాని వల్లే కేటీఆర్ (KTR) ఎమ్మెల్యే అయ్యారని బండి సంజయ్ అన్నారు.ఈ వ్యాఖ్యలతో పాటు, కేటీఆర్‌ను చర్చకు ఆహ్వానిస్తూ సవాల్ విసిరారు. “చర్చకు నేను వేదికని కరీంనగర్‌లో ఏర్పాటు చేస్తా మధ్యవర్తిగా కూడా పని చేస్తా” – బండి సంజయ్
కేటీఆర్ భాషపై విమర్శలు – “భాష మార్చుకోండి, లేకపోతే చర్యలు తీసుకుంటాం”
కేటీఆర్ ఇటీవల వాడిన భాషను తీవ్రంగా విమర్శించిన బండి సంజయ్, రాజకీయ నేతగా ఆయన భాష శ్రేయస్కరంగా లేదన్నారు. బీఆర్‌ఎస్‌ను “తండ్రి, కొడుకు, అల్లుడు” పార్టీగా అభివర్ణించిన బండి సంజయ్, బీఆర్‌ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని, బీజేపీలో విలీనం అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కంచ గచ్చబౌలి భూముల వివాదం – తీవ్ర ఆరోపణలు
కేటీఆర్ గతంలో సీఎం రమేశ్‌పై కంచ గచ్చబౌలి భూముల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, రోడ్డు కాంట్రాక్ట్‌ల్లో నేరపూరిత లక్షణాలున్నాయని విమర్శించారు. దీనికి ప్రతిస్పందనగా ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వకపోతే, కేటీఆర్ తన వద్దకు వచ్చి వాపోయాడని సీఎం రమేశ్ వెల్లడించారు. ఇది నిజం కాదని కేటీఆర్ చెప్పగలరా? అని సవాల్ విసిరారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Telangana Rains : హైదరాబాద్ వాసులకు వర్షాల నుంచి రిలీఫ్