Bandi Sanjay: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం నేడు ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. కేంద్ర మంత్రి రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.
Read Also : TTD June Darshan Tickets: తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల

భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు
గత శనివారం నిర్వహించిన ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ ముగింపు సమయానికి కొండగట్టు ఆలయం ద్వారాలు మూసివేశారు. ఆ సమయంలో బండి సంజయ్ ఆలయ ముఖద్వారం వద్దే మొక్కు తీర్చుకుని వెనుదిరిగారు. నేడు మళ్ళీ ఆలయానికి విచ్చేసి. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. పూజల అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బండి సంజయ్‌తో పాటు కరీంనగర్ మేయర్ సునీల్ రావు, బీజేపీ కీలక నేతలు ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి మరియు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలయ అధికారులు బండి సంజయ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. శనివారం కావడంతో సాధారణ భక్తుల రద్దీ కూడా అధికంగా ఉండటంతో కొండగట్టు అంజన్న క్షేత్రం భక్తజనసంద్రంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :