📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Bandi Sanjay: అక్బరుద్దీన్ కు హైడ్రా మినహాయింపు ఇచ్చిందా? బండి సంజయ్ కుమార్

Author Icon By Ramya
Updated: July 8, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మేడిపల్లి/ భీమారం (జగిత్యాల జిల్లా) : అక్రమ నిర్మా ణాల పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు చెరువులు, కుంటల్లో భవంతులు నిర్మించి కాలేజీలు, వ్యాపారాలు చేసుకుంటున్న అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) కుటుంబానికి మినహాయింపు ఇచ్చారా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమార్ ప్రశ్నించారు. మేడిపల్లి, భీమారం మండలాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక అభివ్రుద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వెంకట్రావుపల్లెలో పీఎంశ్రీ పథకం కింద ఎంపికైన వేంకట్రావుపల్లె స్కూల్ (Venkatraopalli School) ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్బరుద్దీన్ కాలేజీలో 10 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నందున అక్రమ నిర్మాణాలైనా వాటిని కూల్చలేమని చెబుతున్న హైడ్రా అధికారులు.. ఏ జీవనాధారం, గూడు లేక మూసీ పరివాహక ప్రాంతాల్లో కట్టుకున్న గుడిసెల్లో, చిన్న చిన్న ఇండ్లను ఎందుకు కూల్చివేశారని నిలదీశారు.

Bandi Sanjay: అక్బరుద్దీన్ కు హైడ్రా మినహాయింపు ఇచ్చిందా? బండి సంజయ్ కుమార్

“పేదల గుడిసెలు కూలుస్తూ, అధికారులకు అప్పగించని అక్రమ భవనాలకు రక్షణ ఎందుకు?” — బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

అక్బరుద్దీన్ కుటుంబానికే విలువ ఉంటుందా? పేదల ప్రాణాలకు, జీవితాలకు విలువ లేదా? వాళ్లు మనుషులు కాదా? ఎంఐఎం నాయ కులు పోలీసులను కొడితే చర్యలు తీసుకోరని, కరెంట్ బిల్లులు కట్టకుంటే వత్తాసు వలుకుతారా? ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కబ్జా చేస్తే వత్తాసు పలుకుతారా? ఆఖరికి తీవ్రవాదులతో సంబంధాలున్న వాళ్లకు ఉద్యోగాలిచ్చి పోషిస్తుంటే పట్టించుకోరా? ఇదేం పద్దతి..”అంటూ మండి పడ్డారు. మీడియాపై దాడులు చేస్తుంటే ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిగారు.. మీకు పౌరుషం లేదా? మిమ్ముల్ని ఆకారణంగా జైల్లో వేసి బెయిల్ రాకుండా చేశారు కదా? అవన్నీ మర్చిపోయి వాళ్లతో కుమ్మక్కైపోయారా? కాళేశ్వరం, ఈఫార్ములాసహా అనేక స్కాంలు చేసిన కేసీఆర్ కుటుంబాన్ని మీడియాతో మాట్లాడుతున్న కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎందుకు అరెస్ట్ చేసి బొక్కలో వేయడం లేదని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని, మీడియా స్వేచ్ఛను కాపాడే విషయంలో బీజేపీ ముందుంటుందని చెప్పారు.

అక్బరుద్దీన్ కాలేజీకి మినహాయింపు ఇచ్చి, మూసీ పరివాహకంలో పేదవారి గుడిసెలను ఎందుకు కూల్చారు?

అక్బరుద్దీన్ కాలేజీలో 10 వేల మంది విద్యార్థులు ఉన్నారంటూ అక్రమ నిర్మాణాలు కూల్చలేమని హైడ్రా అధికారులు అంటున్నారు. అయితే మూసీ పరివాహకంలో పేదవారి గుడిసెల్ని ఎందుకు కూల్చేశారో చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

బండి సంజయ్ ప్రభుత్వం పై ఎలాంటి విమర్శలు చేసారు!

ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తోందని.

పోలీసులపై దాడులు చేసిన నాయకులపై చర్యలు ఉండవని.

పేదలపై మాత్రం కఠినంగా వ్యవహరిస్తుందని అని తీవ్ర విమర్శలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: flood water: ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

AkbaruddinOwaisi BandiSanjay Breaking News HyderabadPolitics IllegalDemolitions latest news Medipally RevanthReddy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.