Bandi Sanjay Kumar: ఆ వార్నింగ్ కాంగ్రెస్ సీనియర్లకే.. సిఎం భాష బాధాకరం

Read Time:  1 min
Bandi Sanjay Kumar: ఆ వార్నింగ్ కాంగ్రెస్ సీనియర్లకే.. సిఎం భాష బాధాకరం
FONT SIZE
GET APP

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. గురువారం కరీంనగర్ మీడియా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అసమ్మతి రాగాలు వినిపిస్తుండటంతో, వారిని హెచ్చరించేందుకే తొక్కుకుంటూ వచ్చా.. ఇంకా తొక్కుతాఖి అనే భాష రేవంత్ రెడ్డి వాడుతున్నారని విమర్శించారు. ప్రజలు ఆశీర్వదిస్తే పదవి వచ్చిందని చెప్పాల్సింది పోయి, ఇలాంటి అహంకార పూరిత భాష వాడటం ప్రజలు అసహ్యించు కుంటున్నారనీ తెలిపారు.

Read Also : Anakapalli crime: మైనర్ బాలికపై అత్యాచారం.. పోలీసుల అదుపులోకి నిందితుడు

Bandi Sanjay Kumar: That warning is for Congress seniors.. CM's language is painful
Bandi Sanjay Kumar: That warning is for Congress seniors.. CM’s language is painful

వందేమాతరం వివాదంపై మోనం ఎందుకు? శాసన సభలో వందేమాతరం గేయ ఆలాపనను ఎంఐ ఎం ఎమ్మెల్యేలు బహిష్కరించడాన్ని బండి సంజ య్ ఖండించారు. జాతీయ గేయాన్ని అవమా నించినా స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉంటే ఎంఐఎం నేతల మెడలు వంచి వందేమాతరం పాడించే వాళ్లమని సంచలన వాఖ్యలు చేశారు. భారతీయతను గౌరవించని వారిని కటకటాల్లోకి నెట్టేవాళ్లమని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.41,000 వేల కోట్లు బాకీ వివరించారు..ఒక్కో రైతుకు రూ.30,000, దాదాపు పడిందని ఎకరాకు వ్యవసాయ కూలీలకు రూ.36,000 చొప్పున ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందన్నారు. తక్షణమే ఈ బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేయాలని, లేదంటే కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీ యాలని రైతులకు పిలుపునిచ్చారు. మూసీ ప్రక్షాళనపై వైఖరి మూసీ నది పునరుజ్జీవానికి బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇళ్లను కూల్చడాన్ని సహించబోమని బండి సంజయ్ పునరుద్ఘాటిం చారు. గుజ రాత్లోని సబర్మతి తరహాలో బాధితులకు ఇళ్లు కట్టించి, అన్ని హామీలు నెరవేర్చిన తర్వాతే ప్రక్షాళన చేపట్టాలని డిమాండ్ చేశారు. తనకు కేటాయించిన శాఖపై మంత్రి శ్రీధర్బాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. కేంద్రంలో హోంశాఖ అత్యంత కీలకమైనదని, ప్రధాని మోదీ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు ఇచ్చారని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత బీజేపీదేనని ఆయన పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.