📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Bandi Sanjay Kumar: కుక్క కాటుకు మందు లేదా?

Author Icon By Sushmitha
Updated: November 25, 2025 • 1:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హుస్నాబాద్ రూరల్: ప్రభుత్వ ఆసుపత్రులలో కుక్క కాటుకు కూడా మందు అందుబాటులో లేని దుస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హుస్నాబాద్ (Husnabad) ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన, పేద, మధ్యతరగతి ప్రజలకు సర్కారు దవాఖానాల్లో మందులు లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎన్ఎండీసీ (NMDC) సంస్థ సహకారంతో సీఎస్‌ఆర్ (CSR) నిధులతో దాదాపు రూ.కోటి విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు.

 Read Also: Kavitha: నిరంజన్ రెడ్డి అవినీతిపై పిల్లాడిని అడిగినా చెబుతాడు: కవిత

Bandi Sanjay Kumar Is there no medicine for dog bites?

కొత్త వైద్య పరికరాల ప్రారంభం, రోగులతో సంభాషణ

మంత్రి బండి సంజయ్ ప్రారంభించిన వైద్య పరికరాలలో ఈసీజీ మిషన్లు, అల్ట్రాసౌండ్, ఈఎన్టీ, సర్జికల్ మైక్రోస్కోప్, మల్టిపుల్ మానిటర్లు, మార్చురీ కేబినెట్ సహా మొత్తం 15 రకాల వైద్య పరికరాలు (మెడికల్ ఎక్విప్‌మెంట్స్) ఉన్నాయి. ఆయా పరికరాల ద్వారా అందించే సేవలను గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులను కలిసి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. డాక్టర్లతో సమావేశమై ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వాలపై విమర్శలు, వైద్యులకు సూచనలు

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, సర్కార్ ఆసుపత్రులకు వచ్చే వారంతా పేద, మధ్య తరగతి ప్రజలేనని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేసుకోలేని వాళ్లేనని అన్నారు. “సూది మందుతో పాటు కనీస సౌకర్యాలు లేకపోతే పేదల పరిస్థితి ఏంటి, వారు చావాల్సిందేనా?” అని ప్రశ్నించారు. విద్య, వైద్య రంగాలకు సంబంధించి పేదలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, దురదృష్టవశాత్తు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని విమర్శించారు.

“ఇక్కడికి వచ్చే రోగులకు సూదుల్లేవు, మందుల్లేవు, టెస్టులు చేయడానికి పరికరాల్లేవు అనే వార్తలు చూశాను. కుక్క కాటుకు మందు కూడా లేదని వార్తలొస్తున్నాయంటే పేదల పరిస్థితి ఏంది, వారు చనిపోవాల్సిందేనా?” అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేంద్ర నిధులతోనే దాదాపు సర్కార్ ఆసుపత్రులు అన్ని నడుస్తున్నాయని, నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా పెద్ద ఎత్తున అత్యాధునిక పరికరాలకు నిధులు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వకపోవడం వల్ల చిన్న చిన్న మెడికల్ పరికరాల కొనుగోలు చేయలేక ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు.

తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన పరికరాలను, సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. “ఇకపై ఒక్క పేషెంట్ కూడా ట్రీట్‌మెంట్ కోసం బయటకు వెళ్లే పరిస్థితి రానీయొద్దు. ఈ ఆసుపత్రికి ఇంకా ఏమేం కావాలో చెప్పండి, అన్ని సౌకర్యాలను సమకూరుస్తాను” అని హామీ ఇచ్చారు. వైద్యులు పేదలకు సేవ చేయడం మహా భాగ్యం అని, మానవ సేవే మాధవ సేవ అని గుర్తుంచుకుని సేవలందించాలని కోరారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ ఏ ఆసుపత్రిని సందర్శించారు?

హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.

NMDC సంస్థ సహకారంతో ఆసుపత్రికి ఎన్ని కోట్ల విలువైన పరికరాలను అందించారు? దాదాపు రూ.కోటి విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను అందించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Bandi Sanjay Kumar Google News in Telugu Government Hospitals healthcare crisis Husnabad hospital Latest News in Telugu medical equipment Telangana politics. Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.