📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Bandi Sanjay: విద్యార్థులకు మోడీ కిట్స్ -సైకిళ్లు పంపిణి చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్

Author Icon By Sharanya
Updated: July 10, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కరీంనగర్: కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పదవతరగతి చదివే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్ర మానికి హాజరయ్యారు. మొత్తం 20 వేల సైకిళ్లను స్వయంగా కొనుగోలు చేసిన బండి సంజయ్ (Bandi Sanjay) వాటిని దశల వారీగా పంపణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదట కరీంనగర్ టౌన్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ (Distribution of bicycles) చేశారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ అశ్వినీ, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజీపీ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి, ఆర్డీవో, డీఈవోతోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు.

స్ఫూర్తినింపిన నాయకుడు ప్రధాని మోడీ

ఈ సందర్భంగా బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అండగా ఉంటూ సమాజానికి సేవ చేయాలనే మా లో ఎప్పటికప్పుడు స్ఫూర్తినింపిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) అని అన్నారు. వారి బాటలో నడుస్తూ మాకు చేతనైనంత సాయం చేస్తున్నాం. ఈ సైకిళ్ల పంపిణీ ఆలోచన ఇచ్చిందే జిల్లా కలెక్టర్. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో బాలికలకు సైకిళ్లు ఇస్తే బాగుంటుందని జిల్లా కలెక్టర్ ప్రతిపాదించారు. ఆ ఆలోచనతోనే టెన్త్ విద్యార్థినీ, విద్యార్థులందరికీ సైకిళ్లు పంపిణీ చేస్తున్నం. ఇవి ప్రభుత్వ నిధులు కావు. అట్లని నేను కోట్లు ఖర్చు పెట్టేంత సంపన్నుడిని కాదు. మా దగ్గరకు వచ్చిన కొందరు కార్పొరేట్ కంపెనీల యాజమానులను మీరు సంపాదించిన సొమ్ములో కొంత సీఎస్సార్ ఫండ్ కింద ఇవ్వాలని కోరితే వారు సానుకూలంగా స్పందించి ఆ నిధులు అందిస్తే వాటితో సైకిళ్లను కొని మీకు పంపిణీ చేస్తున్నా. నేను కూడా చిన్నప్పటి నుండి మీలాగే పేదరికంలో పెరిగిన ఇక్కడే కాపువాడలో పుట్టి పెరిగిన. తినడానికి ఇబ్బంది పడ్డ. మా తల్లి దండ్రులు మమ్ముల్ని ఎంతో కష్టపడి చదివించారు.

మీ ఇబ్బందులు తెలుసుకునే సైకిళ్లను పంపిణీ చేస్తున్నా

కష్టాలు తెలిసిన వ్యక్తిని కాబట్టే మీరు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని సైకిళ్లను పంపిణీ చేస్తున్నా. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో రోల్ మోడల్. ఒడిశా నుండి వచ్చి కష్టపడి పని చేస్తూ మీఅందరికీ స్పూర్తిగా ఉన్నారు. పోలీస్ కమిషనర్ బీహార్ నుండి ఇక్కడికి వచ్చారు. ఆయన తండ్రి మిలటరీలో పనిచేశారన్నారు.. క్రమ శిక్షణతో ఎదిగి వచ్చారు. వీళ్లే కాదు… మహాత్మా గాంధీ, అంబేద్కర్, మోదీ కూడా పేదరికం నుండి ఎదిగిన వాళ్లే. ముఖ్యంగా అంబేద్కర్ ఎన్ని కష్టాలు అనుభవించారో, అంటరానితనాన్ని ఎదుర్కొన్నారే మాటల్లో చెప్పలేం. ఇప్పుడు మీ కష్టాలను తీర్చడానికి మోదీ ఉన్నాడు. మా హయాంలో ఆదుకునే వాళ్లే లేరు. మోదీ ప్రభుత్వం విద్యా రంగానికి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. యూపీఏ హయాంలో (2014 15 బడ్జెట్లో) విద్యా రంగానికి కేంద్రం 68 వేల 728!! కోట్లు మాత్రమే కేటాయిస్తే. ఈ ఒక్క ఏడాదే (2025 26) 1 లక్షా 28వేల 650 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. అంటే యూపీఏతో పోలిస్తే విద్యా రంగానికి నిధుల కేటాయింపు రెట్టింపు పెరిగిందన్నారు. ఈ 11 సంవత్సరాల్లో ఒక్క విద్యా రంగానికే దాదాపు 8!!లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామంటే విద్యా రంగంపై మోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

అయితే… ఇన్ని నిధులు ఖర్చు చేస్తున్నా విద్య అనేది 1976 వరకు రాష్ట్ర ప్రభుత్వాల నిధుల విషయానికొస్తే రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం కూడా నిధులు కేటాయిస్తుందన్నారు. అయితే పాఠశా లలను నడిపే బాధ్యతను, స్థానిక భాషలో పాఠ్యంశాలు బోధించే ౦చే అంశాలను అమలు చేయా ల్సింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే. ఎందుకంటే కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో విద్యా రంగం ముందుకు సాగుతుందనే నమ్మకంతోనే ఈ జాతీయ విద్యా విధానాన్ని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మీకందిస్తున్న సైకిళ్లు మోదీ గిఫ్ట్. అతి త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అతి త్వరలో “మోదీ కిట్స్”ను అందజేయబోతున్నాం. ఎన్ని వేల మంది ఉన్నా, ఎన్ని లక్షల మంది ఉన్నా వాళ్లందరికీ మోదీ కిట్స్ ను అందిస్తామని అన్నారు .

తెలంగాణలో బండి సంజయ్ పదవి ఏమిటి?

ఆయన మార్చి 11, 2020 నుండి జూలై 4, 2023 వరకు తెలంగాణలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. జూలై 30, 2023న ఆయనను బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు మరియు ఆగస్టు 4, 2023న ఆయన ఆ పదవిని చేపట్టారు. జూన్ 9, 2024న ఆయన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: ATM Robbery: గ్యాస్ కట్టర్లతో ఎటిఎంలో చోరీ

Bandi sanjay Bicycle distribution BJP student support Breaking News latest news Modi Kits distribution Student welfare schemes Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.