📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Bandi Sanjay: మరో రికార్డుకు సిద్ధమైన బండి సంజయ్ కుమార్

Author Icon By Ramya
Updated: July 9, 2025 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మోడీ కానుకగా 20 వేల సైకిళ్ల పంపిణీ

హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) కరీంనగర్ వేదికగా మరో మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థిని, విద్యార్థులందరికీ (students studying in 10th grade) రేపటి నుండి ఉచితంగా సైకిళ్లను అందించనున్నారు. మొత్తం 20 వేల సైకిళ్లను పంపిణీ చేయాలని బండి సంజయ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు బ్రాండెడ్ సైకిల్ కంపెనీకి ఆర్డర్ కూడా ఇచ్చారు. సీఎస్సార్ (కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్ బిలిటీ) ఫండ్స్ ను చెల్లించి ఈ మొత్తం 7 సైకిళ్లను కొనుగోలు చేశారు. ఒక ప్రజా ప్రతినిధి తన నియోజకవర్గ పరిధిలో 20 వేల సైకిళ్లను పంపిణీ చేయడం ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు. ఆ క్రెడిట్ బండి సంజయ్ కే దక్కబోతోంది. ఈ సైకిళ్ల పంపిణీ ప్రారంభ కార్యక్రమానికి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం (Karimnagar Ambedkar Stadium) వేదిక కాబోతోంది. ఇందుకోసం స్టేడియంలో అన్ని ఇ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత కరీంనగర్ టౌన్ లో టెన్త్ చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు బండి సంజయ్ రేపు ఉదయం 11 గంటలకు తన చేతుల మీదుగా సైకిళ్లను అందజేయ బోతున్నారు. మొత్తం 21 స్టాల్స్ ను ఏర్పాటు చేసి రంగు రంగుల బెలూన్లు, షామియానాలతో వాటిని అందంగా ముస్తాబు చేశారు.

Bandi Sanjay

సైకిళ్ల పంపిణీకి జిల్లా కలెక్టర్‌కు బాధ్యత

Bandi Sanjay: ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంసహా పలువురు ఉన్నతాధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు హాజరుకానున్నారు. మరోవైపు ప్రతి విద్యార్థికి ఈ సైకిల్ ను అందించాలనే ఉద్దేశంతో సైకిళ్ల పంపిణీ బాధ్యతను జిల్లా కలెక్టర్కు అప్పగించారు. కలెక్టర్ ద్వారా డీఈఓ, ఎంఈవో స్కూళ్ల వారీగా ఎంత మంది విద్యార్థులున్నారనే జాబతాను సిద్ధం చేసిన అధికారులు ఆ మేరకు సైకిళ్లను ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా సైకిళ్లను పంపీణీ చేయనున్నారు. నెల రోజుల్లో ఈ సైకిళ్ల పంపిణీ పూర్తి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదువుకునే ప్రతి విద్యార్థినీ, విద్యార్ధికి ఈ సైకిల్ ను అందజేయాలని కలెక్టర్ను కోరారు. టెన్త్ విద్యార్థుల కష్టాలను తొలగించేందుకే సైకిళ్ల పంపిణీ. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలు పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్లే ఉంటారనే విషయం తెలిసిందే. తమ ఇంటి నుండి స్కూల్దాకా వెళ్లడానికి తగిన రవాణా సౌకర్యా ల్లేక, ఆటోలు, బస్సులు వెళ్లే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా టెన్త్ క్లాస్ విషయానికొచ్చే సరికి స్కూల్ వేళలు ముగిసిన తరువాత కూడా స్పెషల్ క్లాస్ లకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనివల్ల పొద్దుపోయేదాకా స్కూళ్లోనే ఉండాల్సి వస్తుంది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని టెన్త్ బాలబాలికలకు రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారనే విషయం బండి సంజయ్ కుమార్ ద్రుష్టికి వచ్చింది. వేల రూపాయలు వెచ్చించి సైకిళ్లు కొనే స్తోమత ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకు లేదని గ్రహించిన బండి సంజయ్ సీఎస్సార్ ఫండ్స్ ను సేకరించి 20 వేల సైకిళ్లను కొనుగోలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కానుక పేరుతో ప్రతి ఒక్కరినీ సైకిళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.

బండి సంజయ్ ఏ నియోజకవర్గం?

బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాన్ని ప్రతినిధిస్తూ 2019 నుంచి ఎంపీగా ఉన్నారు. 2024లో మరోసారి విజయం సాధిస్తూ మోదీ మంత్రివర్గంలో కూడా కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పదవీ భరణ చేశారు.

శ్రీ బండి సంజయ్ కుమార్ ఎవరు?

శ్రీ బండి సంజయ్ కుమార్ ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు ప్రస్తుతం భారత ప్రభుత్వ హోం వ్యవహారాల సహాయ మంత్రిగా తన విధులను నిర్వర్తిస్తున్నారు. ఆయన కరీంనగర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడు.

Read hindi news: hindi.vaartha.com

Read also: TG Criminal Act: నూతన క్రిమినల్ చట్టాల అమలుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి సమీక్ష

BandiSanjay Breaking News CSRFunds CyclePumpini GovernmentSchools Karimnagar latest news NarendraModiKanuka Telugu News TentStudents

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.