📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

తెలంగాణ సర్కార్ పై బండి సంజయ్ ఆగ్రహం

Author Icon By Sudheer
Updated: January 5, 2025 • 8:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తూట్లు పొడిచాయని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇందిరమ్మ భరోసా పేరుతో రైతులకు ఎకరాకు రూ.15వేలు ఇస్తామన్న హామీపై నిలదీస్తూ, ఇప్పుడు రూ.12వేలు మాత్రమే ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను సర్కారు నిలబెట్టుకోలేకపోయిందని బండి సంజయ్ ఆరోపించారు. ఏడాది పాటు రైతు భరోసా చెల్లించకపోవడం, గత ఏడాది బకాయిలను సైతం విభజించి నాలుగేళ్లకు చెల్లిస్తామంటూ తేల్చడం అన్యాయమని మండిపడ్డారు. రైతులను దగా చేయడమే కాంగ్రెస్ డీఎన్ఏలో ఉందని విమర్శించారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో రైతులకు ఎలాంటి అదనపు సహాయం చేయకుండా, రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలను పూర్తిగా విస్మరించడం అన్యాయమని చెప్పారు. ఎగగొట్టిన రుణమాఫీ, సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇవ్వడం వంటి నిర్ణయాలను బండి సంజయ్ తప్పుబట్టారు.

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది తర్వాత కూడా అవి పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం పేద ప్రజలపై మోసంగా పేర్కొన్నారు. మహిళలకు, వృద్ధులకు, నిరుద్యోగులకు ఇచ్చిన ఆర్థిక సాయాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.

రైతు సంక్షేమం పేరుతో తెచ్చిన పథకాలపై కోతలు విధించడం, ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమవడం కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలుగా బండి సంజయ్ అభివర్ణించారు. రైతు సంక్షేమంపై కేంద్రం అనేక పథకాలను అమలు చేస్తూ, దేశ వ్యాప్తంగా రైతులకు మేలు చేస్తుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిరాశకు గురి చేస్తోందని విమర్శించారు.

Bandi sanjay Congress government rythu bharosa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.