📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: B.V. Raghavulu: విద్యుత్ చట్ట సవరణతో ఉచిత విద్యుత్ రద్దయ్యే ప్రమాదం

Author Icon By Sushmitha
Updated: October 23, 2025 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణ(Telangana) అసెంబ్లీలో బీసీలకు(BC) 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు మద్దతిచ్చి, కేంద్రంలో మాత్రం ఆమోదించకుండా బీజేపీ అడ్డుకుంటుందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. బీజేపీ బీసీల పట్ల మోసపూరితంగా, రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. బుధవారం ఎంబీ భవన్‌లో జరిగిన సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Read Also: Rain Alert: మరో 3 రోజులు భారీ వర్షాలు

రాజ్యాంగ సవరణకు డిమాండ్, విద్యుత్ చట్ట సవరణపై ఆందోళన

కోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ల(Reservations) పరిమితిని ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేస్తే బీసీలకు స్థానిక సంస్థలతో పాటు అన్ని రకాలుగా 42 శాతం రిజర్వేషన్ అమలవుతుందని పేర్కొన్నారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర బంద్‌లో బీజేపీ పాల్గొనడం దాని మోసపూరిత వైఖరికి నిదర్శనమన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గవర్నరుకు చెప్పి బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ చట్ట సవరణతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణ అమల్లోకి వస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు రద్దవుతాయని, డిస్కంలు ప్రైవేటుపరం అవుతాయని విమర్శించారు. ఈ సంస్కరణలన్నీ ప్రజల కోసం కాదని, ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు లాభం చేకూర్చడం కోసమేనని ఆయన అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక

మరో పొలిట్ బ్యూరో సభ్యులు విజయరాఘవన్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేస్తోందని విమర్శించారు. మత విద్వేషాలను రెచ్చగొడుతోందని, జ్ఞానవాపి, మధుర వంటి విషయాలను వివాదాస్పదం చేస్తోందని అన్నారు. బీహార్‌లో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు ఓడిస్తారని, అక్కడ బీజేపీ కూటమిని ఓడించడమే తమ లక్ష్యమని, అందుకే తాము మహాకూటమిలో ఉన్నామని వివరించారు.

సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో(Jubilee Hills by-election) బీజేపీని ఓడించడమే తమ కర్తవ్యమని, అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినా, ప్రజా సమస్యలపై పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. రైతుల ఆమోదం ఉంటేనే ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సీపీఎం చేసిన ప్రధాన విమర్శ ఏమిటి?

అసెంబ్లీలో మద్దతిచ్చి, కేంద్రంలో బిల్లును అడ్డుకుంటుందని, ఇది బీజేపీ రెండు నాల్కల ధోరణి అని విమర్శించారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీపీఎం ఎవరికి మద్దతు ఇచ్చింది?

బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

BC Reservation BV Raghavulu CPM electricity bill Google News in Telugu Latest News in Telugu political criticism. Telangana politics Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.