📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

B.S. Rambabu: బ్యాంకుల్లో పనిచేస్తున్న అప్రైజర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలి

Author Icon By Ramya
Updated: July 21, 2025 • 4:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు (B.S. Rambabu)

హైదరాబాద్ : బ్యాంకులలో పనిచేస్తున్న అప్రైజర్స్ కు ఉద్యోగ భధ్రత, మెరుగైన అప్రెయిజర్ చార్జీల చెల్లింపు, తగిన గౌరవం, పని గంటల విధానం కోసం ఎఐబిఇఎ తన వంతు కృషి చేస్తుందని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ (ఎఐబిఇఎ) కార్యదర్శి బి.ఎస్.రాంబాబు (B.S. Rambabu) చెప్పారు. తెలంగాణ యూనియన్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ మొదటి మహాసభ ఆదివారం హైదరాబాద్లోని పర్వానాహాల్లో జరిగింది. సమావేశానికి తెలంగాణ ఆల్ బ్యాంక్స్ గోల్డ్ అప్రైజర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎ.రాఘవాచారి అధ్యక్షత వహించగా, సమావేశాన్ని (meeting) ఉద్దేశించి బిఎస్ రాంబాబు (B.S. Rambabu), ఎ పిటిబిఇఎఫ్ అధ్యక్షులు టి.రవీంద్రనాథ్, యుబిఏ ఈయుటిఎస్ ప్రధాన కార్యదర్శి సమద్ ఖాన్, తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు వి.రాఘవాచారి, విశ్వకర్మ ఆత్మగౌరవ భావన ట్రస్ట్ చైర్మన్ ఎల్.వెంకటాచారి, హైకోర్టు న్యాయవాదులు రఘునాథ్, పి.శ్రీనివాస్, కె. అనంత చారి ప్రసంగించారు.

ఉద్యోగుల సమస్యలపై చర్చించని బ్యాంకు యాజమాన్యం

తొలుత బి.ఎస్.రాంబాబు (B.S. Rambabu) ప్రసంగిస్తూ గతంలో బ్యాంకింగ్ రంగం, ఉద్యోగుల సమస్యలపై (employee issues) యాజమాన్యాలు, పాలకులు బ్యాంకు ఉద్యోగుల యూనియన్ చర్చలు జరిపి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం చేసుకునేవని, ఇటీవలి కాలంలో బ్యాంకుల యజమాన్యాలు, పాలకులు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు కూడా నిరాకరిస్తుండడం గర్హనీయమన్నారు. ఫలితంగా ఉద్యోగులు, బ్యాంకింగ్ వ్యవస్థ అనేక సవాళ్లు, సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. యూనియన్ బ్యాంకులో గోల్డ్ లోన్లు నిలిపివేయాలని కొంతమంది అధికారులు అనధికారికంగా తీసుకున్న నిర్ణయంపై ఏఐబిఏ బ్యాంకు ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్కు లేఖ రాసి బంగారంపై రుణాలను నిలిపివేయడం వల్ల బ్యాంకుపై ఖాతాదారులలో అపనమ్మకం ఏర్పడుతుందని, ఫలితంగా బ్యాంకు ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించినట్లు ఆయన చెప్పారు. సమా వేశంలో టిఏబిజిఏఎఫ్ ముఖ్య సలహాదారులు టి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కె. విజయ్ కుమార్, కోశాధికారి ఆ ర్.సతీష్ కుమార్, ఉప ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస చారి, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎ. అనంత రాములు, కార్యవర్గ సభ్యులు, పి.శ్రీకాంత్, జి.నాగ రాజు, యుబిఏఈయుటిఎస్ కార్యదర్శులు కె. రాజేష్ కుమార్ పి. సుధాకర్ రెడ్డి, పి.శ్రీకాంత్, వి.రాజేష్ మనోజ్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: College Closed: 50 ప్రైవేటు డిగ్రీ కాలేజీల మూసివేత?

AIBEA Appraisers Banks Breaking News Gold Loans job security latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.