కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kavitha) జైలుకు వెళ్లడం ఆమె చేసుకున్న కర్మ అని, ఆమె ఎంపిగా ఓడిపోవడం కూడా ఆమె చేసుకున్న కర్మ అని బీఆర్ఎస్ (B.R.S) కార్యకర్తలు ముప్పెట దాడికి దిగారు. అంతేకాక ఇప్పుడు మా పార్టీకి వెన్నుపోటు దారురాలిగా మిగిలిపోవడం ఆమె చేసుకున్న కర్మ కాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కవిత వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడం ఆపకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె గురించి మరింతగా మాట్లాడ తప్పదు అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు
Read Also: Health: పరగడుపున అల్లం తింటే… ఊపిరితిత్తుల సమస్యలకు చెక్!
పార్టీపైనే నిప్పులు కురిపిస్తున్నారని ఎమ్మెల్యే కేపి వివేకానంద
కవిత కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో (Trap) పడిందని అందుకే ఆమె సొంత తండ్రి పెట్టిన పార్టీపైనే నిప్పులు కురిపిస్తున్నారని ఎమ్మెల్యే కేపి వివేకానంద అన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె వ్యంగ్యంగా పోస్టులు పెట్టి ఎవరిని సంతోష పెడుతుందని, కాంగ్రెస్ వారిని కాదా అని వివేకానంద కవితను విమర్శించారు.
పదవులు అనుభవించినప్పుడు కనపడని సమస్యలు కవితకు గత పదేళ్లలో ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవులు అనుభవించినప్పుడు కనిపించని సమస్యలు ఇప్పుడే కొత్తగా కనిపిస్తున్నాయా? అని వివేకానంద అన్నారు. అంతేకాక కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సింది పోయి ఎవరిని సంతోష పెట్టేందుకు, ఎవరికి ప్రయోజనం కలిగించడానికి, ఏ పార్టీకి లాభం చేకూర్చేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వివేకానంద అన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: