B Pharmacy Fee Hike: తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెషనల్ కోర్సులు చేయాలనుకునే సామాన్య విద్యార్థులకు ప్రభుత్వం చేదువార్త చెప్పింది. బీఫార్మసీ, ఫార్మా-డీ, బీఆర్క్ కోర్సుల ఫీజులను భారీగా పెంచుతూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (TAFRC) సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ మేరకు జీవో నంబర్ 10 (GO No. 10) విడుదల చేసింది. ఈ నిర్ణయంతో వందలాది విద్యాసంస్థల్లో ఫీజుల భారం మరింత పెరగనుంది.
Read Also: Groundnut Farmers Protest: మార్కెట్ మాయాజాలానికి బలవుతున్న వేరుశనగ రైతులు
రాష్ట్రంలో మొత్తం 120 బీఫార్మసీ కళాశాలలు ఉండగా, వాటిలో గతంతో పోలిస్తే 10 నుంచి 15 శాతం వరకు ఫీజులు పెరిగాయి. గరిష్ఠంగా ఒక విద్యార్థి ఏడాదికి రూ. 1.21 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో కేవలం మూడు కాలేజీల్లోనే లక్ష రూపాయల పైచిలుకు ఫీజు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య ఆరుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 103 కళాశాలల్లో ఫీజు రూ. 50 వేల మార్కును దాటగా, కేవలం 17 విద్యాసంస్థల్లో మాత్రమే రూ. 45 వేల నుంచి రూ. 49,500 లోపు ఫీజులు ఉన్నాయి.
ఫార్మా-డీ, బీఆర్క్ ఫీజుల (Fee) వివరాలు..
ఫార్మా-డీ కోర్సు విషయానికొస్తే, గతంలో ఉన్న రూ. 1.25 లక్షల గరిష్ఠ ఫీజు ఇప్పుడు రూ. 1,37,500కి చేరింది. రాష్ట్రంలోని 79 ఫార్మా-డీ కాలేజీల్లో 13 చోట్ల ఫీజు లక్ష రూపాయలకు పైగా ఉంది. ఈ కోర్సులో కనిష్ఠ ఫీజుగా రూ. 68 వేలను ప్రభుత్వం నిర్ణయించింది. అటు బీఆర్క్ (ఆర్కిటెక్చర్) విభాగంలో ఉన్న 8 కళాశాలల్లో అశోకా కళాశాల ఫీజు అత్యధికంగా రూ. 1.32 లక్షలుగా ఖరారైంది.
బీఫార్మసీ..
గురునానక్ – రూ.1.21 లక్షలు
CMR – రూ1.10 లక్షలు
విష్ణు ఇన్‌స్టిట్యూట్ రూ-1.06 లక్షలు
సుల్తాన్ ఉలూమ్ రూ.1.05 లక్షలు
పుల్లారెడ్డి -రూ.1.02 లక్షలు
గీతాంజలి- రూ.1.00 లక్షలు.
ఎస్.ఎన్.వనితా మహావిద్యాలయ -రూ.లక్ష
ఫార్మా-డీ..
గీతాంజలి & గురునానక్ -రూ.1.37 లక్షలు
శ్రీదత్త -రూ.1.26 లక్షలు శ్రీ ఇందు,మల్లారెడ్డి, సెయింట్ పీటర్స్, సుల్తాన్ ఉలూమ్ – రూ 1.10 లక్షలు
ఎస్.ఎన్. వనితా మహావిద్యాలయ, సెయింట్ పాల్స్, తాళ్ల పద్మావతి – రూ.1.08 లక్షలు,
భరత్ -రూ.1.07 లక్షలు, మల్లారెడ్డి ఫార్మసీ- రూ.1,02,600 సీఎంఆర్ – రూ.లక్ష.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: