📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త

Latest Telugu News: Azharuddin: అజారుద్దీన్‌కు మంత్రి పదవి… ఈసీకి బీజేపీ ఫిర్యాదు

Author Icon By Vanipushpa
Updated: October 30, 2025 • 3:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మహమ్మద్ అజారుద్దీన్‌(Azharuddin)ను మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు బీజేపీ ఎలక్షన్ కమిషన్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి శంకర్ తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు.

Read Also: AP Crime: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని యువతి ఆత్మహత్య

Azharuddin

ఓట్ల కోసమే హడావుడిగా మంత్రివర్గ విస్తరణ

ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని వారు ఆరోపించారు. ఒక వర్గం ఓట్ల కోసమే హడావుడిగా మంత్రివర్గ విస్తరణ చేపట్టారని విమర్శించారు. అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. మంత్రివర్గ విస్తరణను నిలిపివేయాలని కోరారు. మంత్రివర్గంలోకి అజారుద్దీన్‌ను తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నెల 31న విస్తరణకు అవకాశం ఉందని, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు కూడా ఉండవచ్చునని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మొహమ్మద్ అజరుద్దీన్ ఎవరు?

మహ్మద్ అజారుద్దీన్ (జననం 8 ఫిబ్రవరి 1963) ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా కూడా పనిచేసిన మాజీ క్రికెటర్ . అతను రైట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మరియు అప్పుడప్పుడు మీడియం ఫాస్ట్ బౌలర్. అతను భారతదేశం తరపున 99 టెస్ట్ మ్యాచ్‌లు మరియు 334 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

azharuddin BJP Complaint Election Commission Latest News Breaking News Ministerial Post Politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.