Food Poisoning: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ సంఘనటలపై విచారణకు ఆదేశించినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్(Azharuddin) తెలిపారు. ఈ ఫుడ్ పాయిజనింగ్ ఘటనల్లో నిరక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లో ఒక ప్రకటనలో విద్యార్థులకు భోజనం పెట్టే 30 నిమిషాల ముందు అక్కడ అధికారులు, సిబ్బంది తినాలని నిబంధన పెట్టినట్లు తెలిపారు.
Read also: High Court: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అభ్యంతరాల గడువు పొడిగింపు
వక్ఫ్ భూముల రక్షణపై ప్రభుత్వం ఫోకస్
ఫుడ్ పాయిజన్(Food Poisoning) విషయంలో మరింత అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గురుకులాల్లో కేవలం 40 పోస్టులు మాత్రమే ఖాళీలు ఉన్నాయన్నారు. పోర్టల్ లో వక్ఫ్ భూముల వివరాలు నమోదు చేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశామని చెప్పారు. మైనారిటీ బడ్జెట్ పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ భూముల(Waqf Lands)పై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. ఈ వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాని తెలియచేశారు.
వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్ కోసం యాప్ సరిగా పనిచేయడం లేదని ఈ విషయమై ఇప్పటికే ప్రధానితో పాటు, కేంద్రప్రభుత్వ పెద్దలకు లేఖలు రాశామన్నారు. ప్రత్యేకించి ఉమ్మిద్పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ పోర్టల్ లో గత పది రోజులుగా సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని, వీటిని అధిగమించేందుకు మరి కొంత సమయం పడుతుందని అజారుద్దీన్ తెలిపారు. వక్ఫ్ భూముల ఎన్రోల్మెంట్ కు సమయం పడుతుందని, తప్పుడు పత్రాలతో భూములను అప్లోడ్ చేస్తే రిజెక్ట్ అవుతాయన్నారు. మొత్తం 63,180 ఎకరాల ఆస్తులు ఉన్నాయని, వీటిలో 46 వేల ఎకరాల భూములు పోర్టల్ నమోదు కాలేదదని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: