📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Today News : Army – లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ విధుల్లో చేరిక

Author Icon By Shravan
Updated: September 4, 2025 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ Army : తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల సలహాదారుడిగా నియమితులైన లెఫ్టినెంట్ జెనరల్ కల్నల్ హార్పల్ సింగ్ విధుల్లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసేందుకు రూపొందించిన ఎస్.ఎల్.బి.సి పనుల పునరుద్ధరణ నిమిత్తం బుధవారం రోజున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు లెఫ్టినెంట్ జెనరల్ (Lieutenant General) హార్పల్ సింగ్ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జ, సలహాదారు ఆదిత్యా దాస్ నాధ్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ లతో పాటు ఇ.ఎన్.సి లు అంజద్ హుస్సేన్, శ్రీనివాస్, రమేష్ బాబు లను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు.

టన్నెల్ నిర్మాణంలో నైపుణ్యం

సివిల్ ఇంజినీరింగ్ లో పట్టభద్రుడైన లెఫ్టినెంట్ జెనరల్ హార్పల్ సింగ్ టన్నెల్ నిర్మాణ రంగంలో అపార అనుభవం గడించిన దృష్ట్యా ఆయనను ఈ శాఖలో నియమించిన విషయం విదితమే. ముఖ్యంగా మూడు లక్షల ఎకరాలకు సాగు నీటితో పాటు ఫ్లోరోసిస్ బారిన పడిన నల్లగొండ జిల్లా (Nalgonda District) ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు ఉద్దేశించబడిన ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గం తవ్వకంలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం లెఫ్టినెంట్ జెనరల్ హార్పల్ సింగ్ అనుభవాన్ని వినియోగించుకునేందుకు వీలుగా ఈ నియామకం చేపట్టారు.

SLBC ప్రాజెక్ట్ ప్రాధాన్యత

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఎస్.ఎల్.బి.సి పనులు పూర్తి చేసి త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించిన నేపధ్యంలో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సొరంగ మార్గం తవ్వకాలలో అపార అనుభవం గడించిన హార్పల్ సింగ్ సేవలు వినియోగించుకోనుంది.

హార్పల్ సింగ్ ఈ నియామకం ఎందుకు పొందారు?
సొరంగ మార్గం తవ్వకాలలో, టన్నెల్ నిర్మాణంలో అపార అనుభవం కలిగినందువల్ల SLBC ప్రాజెక్ట్‌కి ఆయనను సలహాదారుగా నియమించారు.

SLBC ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
మూడు లక్షల ఎకరాలకు సాగు నీరు మరియు నల్లగొండ జిల్లాకు సురక్షితమైన త్రాగునీరు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/temple-holy-festivals-begin-in-the-presence-of-lord-sri-kalahasti/andhra-pradesh/541172/

Army Appointments Army News India Breaking News in Telugu Defence Updates Indian Army Latest News in Telugu Lt General Harpal Singh military leadership Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.