📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Tomato Fight : హైదరాబాద్లో ‘టమాటా ఫైట్’ మీరు సిద్ధమా..!

Author Icon By Sudheer
Updated: May 1, 2025 • 7:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ నగరాన్ని వినోదభరితంగా మార్చే మరో విభిన్నమైన ఈవెంట్‌కు వేదిక సిద్ధమైంది. ఈ నెల 11న ఎక్స్పీరియం ఎకో పార్క్‌ లో ‘టమాటా ఫైట్’ జరగనున్నట్లు ఈవెంట్ నిర్వాహకులు ప్రకటించారు. స్పెయిన్‌లో ప్రతి ఏడాది జరగే ప్రసిద్ధమైన ‘లా టమాటినా’ ఉత్సవం స్ఫూర్తిగా ఈ టమాటా ఫైట్‌ను నిర్వహిస్తున్నారు. ప్రజలు ఒకరిపై ఒకరు టమాటాలు విసురుకుంటూ ఆనందంగా ఉత్సాహంగా గడిపే ఈ ఫైట్ కోసం ఇప్పటికే భారీగా టమాటాలను సేకరిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

సరదాగా..సందడి టమాటా ఫైట్

ఈ కార్యక్రమం కేవలం టమాటాల యుద్ధంతోనే కాకుండా, సందడిగా సాగనుంది. ఈ ఈవెంట్‌లో డీజే మ్యూజిక్, డాన్స్, ఫుడ్ స్టాల్స్ వంటి వినోద అంశాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కుటుంబసభ్యులతో వచ్చేందుకు కూడా ఇది అనుకూలమైన కార్యక్రమంగా రూపొందించబడిందని చెప్పారు. యువతలో ఉత్సాహాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా ఈ వినూత్నమైన వేడుకను ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు.

గార్డెన్ కంపోస్ట్‌ కోసం

టమాటాలతో పోటీ ముగిసిన తర్వాత వృథా అయ్యే టమాటాలను వృథా చేయకుండా, వాటిని గార్డెన్ కంపోస్ట్‌ కోసం వినియోగించనున్నట్లు నిర్వాహకులు హామీ ఇచ్చారు. ఈవెంట్ సరదాగా జరగాలనే ఉద్దేశంతో అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ వినూత్న ఈవెంట్ హైదరాబాద్ ప్రజల్లో మునుపెన్నడూ చూడని అనుభూతిని అందించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also : Metro : హైదరాబాద్ మెట్రో సేవల్లో అంతరాయం

Google News in Telugu hyderabad may 11 Tomato Fight

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.