📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Kidnap: మీరేం తల్లిదండ్రులురా.. కూతురినే కిడ్నాప్ చేస్తారా!

Author Icon By Anusha
Updated: September 25, 2025 • 1:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మేజర్ అయిన అబ్బాయి, అమ్మాయి తమకు ఇష్టమైన జీవితభాగస్వామిని ఎంపిక చేసుకునే అధికారం ఉంది. ఇది చట్టం వారికి ఇచ్చిన హక్కు. కానీతమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లిచేసుకుందని అల్లుళ్లను చంపే అత్తామామలు ఉన్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అమృత, ప్రణయ్ ల ప్రేమవివాహం, ఆవిషాదం మనకందరికీ తెలిసిందే.తమకు ఇష్టం లేని అబ్బాయిని పెళ్లి చేసుకుందని, అమృత తండ్రి ప్రణయ్ ను సుపారీతో హతమార్చాడు. తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. పరువుహత్యలకు కొదువ లేదు. తక్కువ కులంవాడిని పెళ్లిచేసుకుందని, కన్న కూతుళ్లనే హతమారుస్తున్నారు. తాజాగా తమ ఇష్టానికి వ్యతిరేకంగా కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పగబట్టారు. అంతటితో ఆగకుండా కూతురి అత్తింటివారిపై మూకుమ్మడిగా దాడి చేశారు.

అడ్డొచ్చిన కూతురిని బయటకు ఈడ్డుకుంటూ తీసుకొచ్చి..ఆమెచేతులు..కాళ్లకు తాడుకట్టి కారులో పడేసి ఎత్తుకెళ్లిపోయారు. సినీఫక్కీలో జరిగిన ఈ కిడ్నాప్ (Kidnap) కు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ అమానుష ఘటన నగర శివారులోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది.

ఆర్యసమాజంలో పెళ్లి

మేడ్చల్ (Medchal) జిల్లా కీసర నగర శివారులోని దమ్మాయిగూడ మున్సిపాల్టీ పరిధిలోని నర్సంపల్లి గ్రామానికి చెందిన చిత్తారి, పద్మల కుమారుడు ప్రవీణ్. అదే గ్రామానికి చెందిన బాల్ నర్సింహ, మహేశ్వరిల కుమార్తె శ్వేత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి వివాహానికి శ్వేత కుటుంబం,ఒప్పుకోలేదు.

దీంతో గల జులై 11న ప్రవీణ్, శ్వేత ఇంటి నుంచి వెళ్లిపోయి సికింద్రాబాద్ లోని ఆర్యసమాజ్ లోపెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత,హైదరాబాద్ (Hyderabad) లో కాపురం ఉంటున్నారు. ఇద్దరిది ఒకే గ్రామం కావడంతో పెద్దలు మనసును మార్చుకుంటారని ఈ జంట భావించింది. ఈ క్రమంలో,ప్రవీణ్ తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో సొంత ఊరు నర్సంపల్లికి వచ్చారు.

Indiramma house: పేదల ఆత్మగౌరవ చిహ్నం ఇందిరమ్మ ఇళ్లు

బలవంతంగా ఎత్తుకెళ్లిన వైనం

ఈ విషయం తెలుసుకున్న శ్వేత తల్లిదండ్రులు బాల్ నర్సింహ, మహేశ్వరి, బంధువులు కారులో వచ్చి ప్రవీణ్ ఇంటిపై దాడి చేశారు. శ్వేతను బలవంతంగా కాళ్లు, చేతులకు తాడుకట్టి కారులో తీసుకెళ్లారు. అడ్డొచ్చిన ప్రవీణ్ తల్లిదండ్రడల కళ్లలో కారం చల్లి, కర్రలతో వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇరుగుపొరుగు వారు చోద్యం చూస్తున్నారే తప్ప ఎవరూ అడ్డుకోలేదు. దీంతో శ్వేత భర్త ప్రవీణ్ కీసర పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన భార్యను తనకు అప్పగించాలని ఆయన పోలీసులను కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Bride Abduction Caste-Based Violence CCTV footage honor killing Keesara Police Station Kidnapping Incident latest news Love Marriage Parental Conflict Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.