📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Appareddypally Kotha Cheruvu: అప్పారెడ్డిపల్లి కొత్త చెరువు కబ్జా.. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ధర్నా

Author Icon By Saritha
Updated: April 2, 2026 • 1:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Appareddypally Kotha Cheruvu: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలో ఉన్న కొత్త చెరువు ఆక్రమణలపై గ్రామస్తుల ఆగ్రహం ఉద్ధృతమైంది. నీటిపారుదల చట్టాలను బేఖాతరు చేస్తూ సర్వే నంబర్ 168లో చేపట్టిన అక్రమ కార్యకలాపాలపై గతంలోనే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, గ్రామస్తులు గురువారం ధర్నాకు దిగారు.గ్రామస్థుల వివరాల ప్రకారం, చెరువు పరిధిలో ఇరిగేషన్, వాల్టా,ప్రభుత్వ ఆస్తుల రక్షణ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘిస్తూ అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా నీటిపారుదల చట్టాల ప్రకారం అలుగు నుంచి వచ్చే నాలాకు అడ్డంగా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదనే నిబంధనను విస్మరిస్తూ పట్టాదారు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.నాలా ద్వారా వచ్చే నీరు కాజ్వే మీదుగా అవతలికి వెళ్లకుండా మరోసారి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.

Read Also: LPG Gas Shortage: ఆటో ఎల్పిజి కొరత రానివ్వొద్దు.. స్టిఫెన్ రవీంద్ర

Appareddypally Kotha Cheruvu: దెబ్బతిన్న సహజ ప్రవాహం.. చెరువుకు ముప్పు

నీటి ప్రవాహాన్ని అడ్డుకునేలా భూమి ఎత్తును పెంచడం వల్ల సహజ ప్రవాహం పూర్తిగా దెబ్బతింది. నాలా పక్కన ఉన్న సుమారు 12 అడుగుల కట్టను ధ్వంసం చేయడం వల్ల చెరువు భద్రతకు ముప్పు ఏర్పడింది. ధ్వంసం చేసిన మట్టిని తిరిగి చెరువు పరిధిలోనే వేసి నీటి మార్గాలను మరింత అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ అక్రమాల కారణంగా వర్షాకాలంలో చెరువుకు నీటి నిల్వ తగ్గిపోవడం, సమీప వ్యవసాయ భూములకు నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

తక్షణ చర్యలకు డిమాండ్

ధర్నాలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ, వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని చెరువు ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై సంబంధిత శాఖ అధికారులు స్పందించి తక్షణమే పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఈ కార్యక్రమం లో గోవింద్ శ్రీధర్, సిపిఎం నాయకులు జగన్, రమేష్, అంజయ్య,చంద్రయ్య, రాములు, నర్సింహా, యాదయ్య,మల్లయ్య, జంగయ్య, మల్లేష్, సత్తయ్య, యాదగిరి,మహేష్ తదితరులు పాల్గోన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Appareddypally Kotha Cheruvu Encroachment CPM Leaders Dharna Irrigation Land Encroachment Protest Madgul Mandal News Rangareddy district news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.