📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Anil Kumar: సినీ కార్మికులకే చిత్రపురి కాలనీ

Author Icon By Ramya
Updated: July 28, 2025 • 12:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్

హైదరాబాద్: హైదరాబాద్ చిత్రపురి కాలనీ సినీ కార్మికులకు మాత్రమేనని చిత్రపురి అసోసియేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ (Anil Kumar) స్పష్టం చేశారు. కాలనీకి సంబంధం లేని వారు కూడా కోట్ల రూపాయల మేర అవినీతి (Corruption) జరిగిందంటూ ఆరోపిస్తున్నారని, అటువంటి వారి వద్ద సరైన ఆధారాలుంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చిత్రపురి కాలనీలో 6 నెలలకోసారి సమావేశంలో కుటుంబ సభ్యుల్లా సమస్యలపై చర్చించుకుంటామని తెలిపారు.

Anil Kumar: సినీ కార్మికులకే చిత్రపురి కాలనీ

చిత్రపురి లావాదేవీలపై ఆరోపణలు నిరాధారమైనవే – అవసరమైన పర్మిషన్లతోనే నిర్మాణాలు

Anil Kumar: చిత్రపురి కాలనీలో 4,713 కుటుంబాలు ఇప్పటికే నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు. రూ.700 కోట్ల నుంచి రూ.850 కోట్ల మధ్య ఉన్న చిత్రపురి కాలనీ లావాదేవీలకు సంబంధించి కొందరు సుమారు రూ.3 వేల కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు మాట్లాడుతున్నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల కొంతమంది చలో ఫిలిం ఛాంబర్, చలో గాంధీభవన్ అంటూ బయటికి వస్తున్నారని విమర్శించారు. ఈ స్థలం ఉచితంగా రాలేదని, కోర్టులో ఉన్న కొన్ని విషయాలపై మాట్లాడలేనన్నారు. 2009లోనే పర్మిషన్లు తీసుకుని రో హౌసులు (Row houses) నిర్మించగా, 2017లో కూడా మరికొన్ని పర్మిషన్లతో బి+2గా మరి కొన్ని రో హౌసులు నిర్మించినట్లు వెల్లడించారు.

పూర్తి అనుమతులతో నిర్మాణాలు – కేసుల వల్ల తాత్కాలిక స్థగితం

అన్నింటినీ పూర్తి అనుమతితోనే నిర్మించినట్లు తేల్చిచెప్పారు. కొంతమంది కేసులు పెట్టడంతో నిర్మాణాలకు బ్రేక్ పడిందన్నారు. ప్రస్తుతం ఉన్న రేట్లు కాలనీపై ఉన్న అప్పును దృష్టిలో ఉంచుకునే నిర్ణయించాం. సఫైర్ సూట్ నిర్మించేందుకు అన్నీ పర్మిషన్లతోనే ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. మొత్తం 51 అంతస్థుల భవనంలో సఫైర్ సూట్ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.
కాలనీలో చిత్ర పరిశ్రమకు చెందిన ఎవరికీ అన్యాయం జరగదని, సరైన మెంబర్షిప్ ఉంటే కచ్చితంగా వారికి ప్లాట్ వచ్చేందుకు పూర్తి సహకారం ఉంటుందన్నారు. సెప్టెంబర్లో జరిగే జనరల్ బాడీ మీటింగ్లో ఆరోపణలు చేసే వారు అధారాలు ఇస్తే దాని ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

చిత్రపురి కాలనీ ఎవరి కోసం కేటాయించబడింది?

చిత్రపురి కాలనీ సినీ కార్మికుల కోసమే కేటాయించబడిందని వల్లభనేని అనిల్ కుమార్ స్పష్టం చేశారు.

అవినీతి ఆరోపణలపై చిత్రపురి అసోసియేషన్ స్పందన ఏమిటి?

సరైన ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని, ఆధారాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Medaram: మేడారం జాతరకు రూ.5 కోట్లు విడుదల

Breaking News Chitrapuri Colony Corruption Allegations film workers latest news Sapphire Suit Telugu News Vallabhaneni Anil Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.