📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Ande Sri: అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

Author Icon By Anusha
Updated: November 10, 2025 • 11:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రూపశిల్పి, ప్రముఖ కవి,రచయిత అందెశ్రీ (64) (నేడు) సోమవారం హఠాన్మరణం చెందారు. ఆయన మరణవార్తతో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.అందెశ్రీ (Ande Sri) మృతిపట్ల రాష్ట్రంలో రాజకీయ, సాహిత్య ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Read also: Ande Sri: అందెశ్రీ మరణం పట్ల సంతాపం తెలిపిన‌ కేటీఆర్

అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) తో పాటు అనేక ప్రముఖ నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ సంతాపం తెలిపారు.ఈ మేరకు ఆయన (Ande Sri) అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరిపించాలని సీఎస్‌ (CS) కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Ande Sri

ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే విడుదల చేసి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.చిన్నతనంలో గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించిన అందెశ్రీ.. ఏనాడూ బడి మొహం చూడకపోయినా తనలోని అపారమైన ప్రతిభతో ప్రజాకవిగా ఎదిగారు.

ఆయనకు చిరస్మరణీయమైన కీర్తిని తెచ్చిపెట్టాయి

ఆయన రచించిన ‘మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు’, తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ ఆయనకు చిరస్మరణీయమైన కీర్తిని తెచ్చిపెట్టాయి. ఆయన సాహిత్య సేవకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University) గౌరవ డాక్టరేట్‌ను సైతం ప్రదానం చేసింది. తెలంగాణ నేల గళాన్ని, ఉద్యమ స్ఫూర్తిని తన పాటల్లో నింపిన అందెశ్రీ లేని లోటు నిజంగా పూడ్చలేనిదే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read also :

Andeshri Jay Jay He Telangana latest news Revanth Reddy Telangana poet Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.