📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Anandi: పెళ్లి గురించి ఎప్పుడూ ప్రత్యేకంగా ఆలోచించలేదు.. హీరోయిన్ ఆనంది

Author Icon By Tejaswini Y
Updated: November 8, 2025 • 6:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వరంగల్ అమ్మాయి నుంచి స్టార్ హీరోయిన్‌గా

స్వభావసౌందర్యంతో, సహజమైన చిరునవ్వుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ ఆనంది(Anandi) ప్రస్తుతం తెలుగు, తమిళ సినీ ప్రపంచంలో తనదైన గుర్తింపు సంపాదించుకుంది. వరంగల్‌కు చెందిన ఆమె, ఇటీవల సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం, పెళ్లి గురించి మనస్ఫూర్తిగా మాట్లాడింది.

ఆనంది మాట్లాడుతూ “చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సినిమా రంగంలోకి రావాలనే ఆలోచన పెద్దగా లేదు. కానీ తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ గారు నన్ను ఒక సినిమాలో చూసి నా పేరును ‘ఆనంది’గా మార్చారు. ఆ పేరు నా జీవితాన్నే మార్చేసింది. అలాగే టీవీ గేమ్ షోలో ఓంకార్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ షోలో నన్ను చూసిన దర్శకుడు మారుతి గారు ‘ఈ రోజుల్లో’ సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా నా సినీ ప్రయాణం ప్రారంభమైంది,” అని చెప్పారు.

సినీ ప్రపంచం నుంచి జీవిత భాగస్వామి వరకు

నేను ఎలాంటి సినిమా కుటుంబానికి చెందినది కాదు. కానీ కష్టపడి నెమ్మదిగా ఇండస్ట్రీలో స్థానం సంపాదించాను. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు వచ్చినా, పెళ్లి విషయంలో అలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. సినిమా ఫీల్డ్‌లో ఉన్నవారినే పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, అని ఆనంది వివరించింది.

ఒక సినిమా షూటింగ్ సందర్భంగా నా భర్త సొక్రటీస్ ను కలిశాను. ఆయన ఆలోచనలు, అభిప్రాయాలు, జీవన విధానం నాకు బాగా నచ్చాయి. అలా మేము ఒకరినొకరం అర్థం చేసుకుని, పెద్దల అంగీకారంతో 23 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మాకు ఒక బాబు ఉన్నాడు వాడి పేరు ప్లేటో, అని ఆనంది ముద్దుగా చెప్పారు.

వ్యక్తిత్వమే నిజమైన అందం

ఎలాంటి మేకప్ లేకపోయినా సహజంగా ఉండటం నాకు ఇష్టం. నిజమైన అందం అంటే మన మనసులో ఉండే సానుకూలతే, అని ఆనంది పేర్కొంది. సినీ ప్రపంచంలో విజయాలు సాధించినా, తాను ఎప్పుడూ సాధారణంగా జీవించడం ఇష్టపడతానని ఆమె అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Anandhi AnandhiInterview AnandhiMarriage AnandhiMovies SumanTV TeluguActress TeluguCinemaNews TollywoodHeroines

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.