📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ameenpur Government Land Encroachment: అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా

Author Icon By Siva Prasad
Updated: February 26, 2026 • 7:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ameenpur Government Land Encroachment: అమీన్‌పూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో అన్యాక్రాంతమవుతున్న అత్యంత విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని మాజీ వైస్ ఎంపీపీ కోకల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన నేతృత్వంలో మాజీ వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు కలిసి తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

Read Also: Harish Rao Inspects Siddipet: దరఖాస్తులు పెండింగ్లో పెట్టొద్దు: హరీష్ రావు

సర్వే నంబర్ల వారీగా ఆక్రమణలు బీరంగూడలోని ప్రసిద్ధ శంభునిగుడి సమీపంలో ఉన్న సర్వే నంబర్ 783లో సుమారు 20 గుంటలు, అలాగే సర్వే నంబర్ 767లో సుమారు 3 గుంటల ప్రభుత్వ భూమి ఉందని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విలువైన భూములను కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని, ఇప్పటికే అక్కడ ఆక్రమణలు బహిరంగంగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Ameenpur Government Land Encroachment: సమగ్ర సర్వేకు విన్నపం

ప్రభుత్వ భూమిని రక్షించకపోతే భవిష్యత్తులో ప్రజా ప్రయోజనాల కోసం లేదా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాల కోసం స్థలం కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. తక్షణమే సంబంధిత అధికారులతో సదరు సర్వే నంబర్లలో సమగ్ర సర్వే నిర్వహించాలని, భూమికి స్పష్టమైన హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు. ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు సిహెచ్ లింగం గౌడ్, పట్లోళ్ల భాస్కర్ రెడ్డి మరియు అమీన్ పూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ameenpur Government Land Encroachment Ameenpur News Beeramguda Shambhunigudi government land encroachment Kokala Srinivas Sangareddy Land Issues Survey Number 783 Tehsildar Representation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.