📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Ambedkar University: అంబేద్కర్ యూనివర్సిటీ డిజిటల్ వర్సిటీ– బిఆర్ఎఒయు–సిఒఎల్ ఒప్పందం

Author Icon By Tejaswini Y
Updated: November 19, 2025 • 11:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ విద్యారంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం(Ambedkar University) మరో కీలక అడుగు వేసింది. ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆకాడమీ (ఐడియా)ను స్థాపించడానికి కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (సీఓఎల్)తో అవగాహన ఒప్పందం చేసుకొంది. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అధ్యక్షుడు, సీఈఓ ప్రొఫెసర్ పీటర్ స్కాట్ మంగళవారం తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో సంతకం చేశారు. బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరచడానికి ఐడియా అత్యాధునిక డిజిటల్ హబ్ పనిచేయనుంది. టెక్నాలజీ ఎనేబుల్డ్ లెర్నింగ్, కృతిమ మేథస్సులో మైక్రోక్రెడెన్షియల్స్ ద్వారా ఫ్యాకల్టీ అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ బ్లూప్రింట్ను రూపొందించడం, వర్చువల్ ల్యాబ్ లకు మద్దతు, ప్రాంతీయ డిజిటల్ లెర్నింగ్ కన్సార్టియం తదితర అంశాలు ఇక్కడికి రానున్నాయి.

Read also : TG: ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల?

Ambedkar University Digital University – BRAOU-COL agreement

తెలంగాణలోని ప్రామాణీకరణ, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా

తెలంగాణలో విద్యా ఆవిష్కరణలకు ఇది మార్గదర్శిగా ఉంటుందని ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. సీఓఎల్ మద్దతుతో భారతదేశ డిజిటల్ విద్యా(Digital Education) ఉద్యమానికి నాయ కత్వం వహించడానికి బీఆర్ఎఓయూ సిద్ధం అవుతోందని ఆయన స్పష్టం చేశారు. వర్సిటీలో ఏఐ ఆధారిత డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు, సమగ్ర లెర్నింగ్ మెనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్) అభివృద్ధి, విద్యార్థుల ప్రాక్టికల్ అనుభవాన్ని సిఎం రేవంత్రెడ్డి సమక్షంలో ఒప్పందపత్రాలు మార్చుకుంటున్న వీసి ప్రొఫెసర్ చక్రపాణి, ప్రొఫెసర్ పీటర్ స్కాట్, చిత్రంలో కేశవరావు ఉన్నారు. పెంపొందించడానికి వర్చువల్ ల్యాబ్స్ రూపకల్పన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ పెడగోగోలో భారీ స్థాయిలో ఫ్యాకల్టీ శిక్షణా కార్యక్రమాలు, తెలంగాణలోని ప్రామాణీకరణ, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా అన్ని విశ్వవిద్యాలయాల కోసం ఏకరీతి డిజిటల్ సౌకర్యాల మైక్రో-క్రెడెన్షియల్స్, తాజా నైపుణ్య కోర్సులు రూపకల్పన అందుబాటులోకి వస్తాయన్నారు.

ప్రొఫెసర్ పీటర్ స్కాట్ మాట్లాడుతూ

ప్రొఫెసర్ పీటర్ స్కాట్ మాట్లాడుతూ కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్, ఓపెన్ లెర్నింగ్, టెక్నాలజీ ద్వారా నాణ్యమైన విద్యను విసృతం చేయడానికి తమ సంస్థ కట్టుబడి ఉందన్నారు. కేరళ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జగతిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ భాగ స్వా మ్యం దేశంలోని అన్ని డిజిటల్ యూ నివర్సిటీలకు మార్గదర్శక మన్నారు. ప్రభుత్వ సలహాదారు డా. కే. కేశవ రావు, వర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫె సర్ పుష్పచక్రపాణి, ప్రొఫెసర్ రవీంద్రనాథ్, ప్రొఫెసర్ పల్లవి, ప్రొఫె సర్ ఆనంద్ పవార్, రిజిస్ట్రార్ డా. ఎల్.వి.కె. రెడ్డి తదితర అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్సిటీ ఉపకులపతిని అభినందిస్తూ, హైదరా బాదుకు ప్రపంచస్థాయి విద్యా సదుపా యాన్ని తీసుకురావడంలో చేసినయత్నాన్ని ప్రశంసించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

Ambedkar University digital university BRAOU COL agreement BRAOU updates Digital university Telangana Telangana education news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.