📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Dr. B. R. Ambedkar: 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం

Author Icon By Pooja
Updated: September 26, 2025 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 30న నిర్వహించనున్నారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఇగ్నో ఉపకులపతి ప్రొఫెసర్ ఉమా కాంజీలాల్(Uma Kanjilal) హాజరుకానున్నట్టు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు.

Telugu News: Tummala Nageswara Rao: సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ

గౌరవ డాక్టరేట్లు – బంగారు పతకాలు

స్నాతకోత్సవ వివరాలను ఆయన గురువారం యూనివర్సిటీ క్యాంపస్‌లో మీడియా సమావేశంలో వివరించారు. ప్రజా కవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ప్రముఖ విద్యావేత్త ప్రేమావత్లకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వనున్నట్టు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. డిగ్రీలో 35, పీజీలో 51 బంగారు పతకాలు, ఇద్దరు ఖైదీలకు బంగారు పతకాలను(Gold medals) ఇవ్వనున్నట్టు చెప్పారు.

గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ స్నాతకోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులకు ఎం.ఫిల్, పిహెచ్.డి పట్టాలు, ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బంగారు పతకాలు, బుక్ ప్రైజులు అందించనున్నట్లు వివరించారు.

పట్టాలు అందుకోనున్న అభ్యర్థులు

26వ స్నాతకోత్సవంలో 60,288 మంది అభ్యర్థులు తమ డిగ్రీలు, డిప్లొమా సర్టిఫికెట్లు పొందనున్నారు. ఇందులో అండర్‌గ్రాడ్యుయేట్‌లో 35,346 మంది, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌లో 24,942 మంది సర్టిఫికెట్లు అందుకోనున్నారు. అదేవిధంగా, వివిధ జైళ్లలో విద్యాభ్యసించిన 203 మంది ఖైదీ అభ్యర్థులు కూడా డిగ్రీలు, పట్టాలు పొందనున్నారు.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవం ఎప్పుడు జరగనుంది?
ఈ నెల 30న జరగనుంది.

స్నాతకోత్సవానికి ముఖ్య అతిథి ఎవరు?
ఇగ్నో ఉపకులపతి ప్రొఫెసర్ ఉమా కాంజీలాల్.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

26th Convocation Ambedkar Open University Breaking News in Telugu Ghanta Chakrapani Goreti Venkanna IGNOU VC Uma Kanjilal Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.